తెలంగాణా కొత్త సచివాలయం కొత్త డిజైన్ ఇదే .. ఆరు అంతస్తులలో అన్ని హంగులతో ..
తెలంగాణ ప్రభుత్వం నూతన సచివాలయం నిర్మాణం విషయంలో దూకుడు పెంచింది. పాత సచివాలయం స్థానంలో కొత్త సచివాలయం నిర్మించడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటికే కొత్త సచివాలయం నిర్మాణానికి సంబంధించిన డిజైన్ ను తయారు చేసింది. ఆరు అంతస్తులతో కొత్త తెలంగాణ సచివాలయాన్ని అందంగా తీర్చి దిద్దింది. దీనికి సంబంధించిన డిజైన్ కొద్దిసేపటి క్రితమే రిలీజ్ చేసింది తెలంగాణ ప్రభుత్వం.
Recommended Video
ఏడాదిలోగా కొత్త సచివాలయం నిర్మాణం పూర్తిచేయాలని తెలంగాణ సర్కార్ భావిస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా త్వరలోనే ఆరంతస్తుల భవనం గా నిర్మితమవుతున్న కొత్త సచివాలయం డిజైన్ కు ఆమోద ముద్ర వేయనున్నారు. ఆయన ఆమోదముద్ర వేయగానే కొత్త సచివాలయం నిర్మాణం మొదలవుతుంది. కోర్టు కొత్త సచివాలయ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వటంతో నేటి నుండి పాత సచివాలయం కూల్చివేత పనులు మొదలుపెట్టిన తెలంగాణ సర్కార్ కూల్చివేతను వేగంగా పూర్తి చేయాలని నిర్ణయం తీసుకుంది.

మొదటిగా సి, జి బ్లాక్లను కూల్చివేస్తున్న సర్కార్, సచివాలయం చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇప్పటికే ఆంక్షలు విధించింది. అర్ధరాత్రి నుంచి ఆర్&బి ఆధ్వర్యంలో కూల్చివేత పనులు నిర్వహిస్తున్నారు. వాహన రాకపోకలను కూడా సచివాలయ రహదారులలో నిషేధించింది. మొత్తానికి సీఎం కేసీఆర్ అనుకున్నట్లుగా తెలంగాణ రాష్ట్రంలో కొత్త సచివాలయం నిర్మాణానికి యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు జరుగుతున్నాయి.అధికారుల పర్యవేక్షణలో అన్ని హంగులతోనూ కొత్త సచివాలయం నిర్మాణం కానుంది.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications