తెలంగాణలో వరుసగా మూడో రోజూ మూడువేలకు: యాక్టివ్ కేసుల్లో భారీ పెరుగుదల

హైదరాబాద్: తెలంగాణలో కరోనా వైరస్ రోజురోజుకూ విజృంభిస్తోంది. దాని దూకుడు మరింత విస్తృతంగా కొనసాగుతోంది. వరుసగా మూడో రోజు కూడా మూడువేలకు చేరువగా కరోనా పాజిటివ్ కేసులు వెలుగులోకి వచ్చాయి. గురువారం నాటి బులెటిన్‌తో పోల్చుకుంటే.. రోజువారీ కేసుల సంఖ్యలో పెరుగుదల కనిపించింది. గ్రేటర్ హైదరాబాద్ సహా ఇతర జిల్లాల్లో కరోనా కరాళ పరిస్థితుల్లో ఎలాంటి మార్పూ ఉండట్లేదు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 500లకు మించి పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.

చాలా రోజుల తరువాత 500 మార్క్‌ను దాటుకున్నాయి కొత్త కేసులు. తెలంగాణలో 24 గంటల వ్యవధిలో కొత్తగా 2932 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 11 మంది మరణించారు. 1580 మంది పేషెంట్లు డిశ్చార్జి అయ్యారు. సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకున్నారు. దీనితో ఇప్పటిదాకా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 1,17,415కు చేరుకుంది. ఇందులో 87,675 మంది డిశ్చార్జి అయ్యారు. కరోనా వల్ల మరణించిన వారి సంఖ్య 799కి చేరుకుంది.

Telangana: Newly 2932 Covid19 positive cases and 11 deaths reported in last 24 hours

మొత్తంగా యాక్టివ్ కేసుల సంఖ్య 28,941గా నమోదైంది. గృహాలు, ఇన్‌స్టిట్యూషనల్ ఐసొలేషన్‌లో 22,097 మంది చికిత్స పొందుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌ పరిధిలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు మళ్లీ మొదటికి వచ్చాయి. 24 గంటల్లో కొత్తగా 520 పాజిటివ్ కేసులు రికార్డు అయ్యాయి. జగిత్యాల, మంచిర్యాల, కరీంనగర్, ఖమ్మం, సిద్ధిపేట, నిజామాబాద్, సూర్యాపేట్ వంటి జిల్లాల్లో వందకు పైగా కొత్త కేసులు నమోదు అయ్యాయి. మేడ్చల్ మల్కాజ్‌గిరి, రంగారెడ్డి జిల్లాలో డబల్ సెంచరీని అందుకున్నాయి.

ఆదిలాబాద్-25, భద్రాద్రి కొత్తగూడెం-89, జగిత్యాల-113, జనగామ-38, జయశంకర్ భూపాలపల్లి-13, జోగుళాంబ గద్వాల-46, కామారెడ్డి-51, కరీంనగర్-168, ఖమ్మం-141, కొమరంభీమ్ ఆసిఫాబాద్-15, మహబూబ్ నగర్-67, మహబూబాబాద్-76, మంచిర్యాల-110, మెదక్-24, మేడ్చల్ మల్కాజ్‌గిరి-218, ములుగు-18, నాగర్ కర్నూలు-42, నల్లగొండ-159, నారాయణపేట్-16, నిర్మల్-32, నిజామాబాద్-129, పెద్దపల్లి-60, రాజన్న సిరిసిల్ల-64, రంగారెడ్డి-218, సంగారెడ్డి-49, సిద్ధిపేట్-100, సూర్యాపేట్-102, వికారాబాాద్-22, వనపర్తి-51, వరంగల్ రూరల్-34, వరంగల్ అర్బన్-80, యాదాద్రి భువనగిరి-42 కేసులు నమోదు అయ్యాయి.

Recommended Video

    RGV 'మర్డర్' సినిమా కి ఝలక్ .. రిలీజ్ వాయిదా | Ram Gopal Varma | Oneindia Telugu

    ప్రాణాంతక కరోనా వైరస్ పరీక్షలను నిర్వహించడంలో తెలంగాణ ప్రభుత్వం తన దూకుడును కొనసాగిస్తోంది. కొత్తగా వ్యాప్తంగా 61,863 శాంపిళ్లను పరీక్షించినట్లు తాజా బులెటిన్‌లో వెల్లడించారు. ఇప్పటిదాకా పరీక్షించిన శాంపిళ్ల సంఖ్య 12,04,343కి చేరుకుంది. ఆర్టీ-పీసీఆర్/సీబీనాట్/ట్రూనాట్, ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టింగ్ కేంద్రాల ద్వారా పరీక్షలను నిర్వహిస్తున్నారు. ప్రతి 10 లక్షలమంది జనాభాకు సగటున 30,772 పరీక్షలను నిర్వహించిన్నట్లు అధికారులు తెలిపారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+