Davos: తెలంగాణలో పెట్టుబడులే లక్ష్యంగా కీలక అడుగు
దావోస్: దావోస్ ప్రపంచ ఆర్థిక సదస్సులో తెలంగాణ పెవిలియన్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రపంచ ఆర్థిక సదస్సు వేదికగా తెలంగాణ ప్రభుత్వం ఇన్వెస్ట్ ఇన్ తెలంగాణ (InvestInTelangana) క్యాంపెయిన్ విజయవంతంగా ప్రారంభించింది.
'తెలంగాణలో పెట్టుబడి పెట్టండి' అనే పేరుతో పెవిలియన్‌ను రూపొందించారు. సృజనాత్మక, సంప్రదాయాల కలయిక (వేర్ ట్రెడిషన్ మీట్స్ ఇన్నోవేషన్) ట్యాగ్ లైన్‌ను ఇచ్చింది. తెలంగాణ రాష్ట్ర సంసృతి, సాంకేతిక సృజనాత్మకతలను ప్రతిబింబించేలా బతుకమ్మ, బోనాలు, చార్మినార్, చేర్యాల పెయింటింగ్, పోచంపల్లి ఇక్కత్, టీ హబ్, స్కైరూట్ ఏరోస్పేస్తో వాల్ డిజైనింగ్ చేశారు.
పెట్టుబడులకు దేశంలోనే మొదటి గమ్యస్థానం, ప్రపంచంలోనే అపార అవకాశాలున్న ప్రాంతం తెలంగాణ వంటి నినాదాలతో పారిశ్రామికవేత్తలను ఆకర్షిస్తున్నారు. 'మీ కోసమే తెలంగాణ' అంటూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హోర్డింగ్ ఏర్పాటు చేశారు.

రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఈ సదస్సులో పాలుపంచుకుంటున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అందులో భాగంగానే ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు తో కలిసి ప్రపంచ దిగ్గజ కంపెనీల ప్రతినిధులతో కీలక సమావేశాల్లో పాల్గొంటున్నారు.
WEF అధ్యక్షుడితో సీఎం రేవంత్ భేటీ
ప్రపంచ ఆర్థిక ఫోరం(WEF) అధ్యక్షుడు బోర్గ్ బ్రెండేతో సీఎం రేవంత్ భేటీ అయ్యారు. హైదరాబాద్‌లో 4వ పారిశ్రామిక విప్లవ కేంద్రం.. సీ4వఐఆర్ ఏర్పాటుపై సంయుక్త ప్రకటన చేశారు. బయోఏషియా సదస్సులో ఫిబ్రవరి 28న సీ4ఐఆర్ ప్రారంబం కానుంది. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ.. ప్రపంచ ఆర్థిక ఫోరం లక్ష్యాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచనలుంటాయన్నారు. డబ్ల్యూఈఎఫ్ తో భాగస్వామ్యంతో వేగంగా లక్ష్యాలు అందుకోవచ్చన్నారు. ప్రజారోగ్యం, సాంకేతికత, మెరుగైన జీవితం కల్పించడం వంటి లక్ష్యాలను చేరుకోవచ్చన్నారు.
మంగళవారం సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు బృందం పలువురు ప్రముఖులను కలిశారు. మెడ్ ట్రానిక్స్ సీఈవో, అపోలో హాస్పిటల్స్ ప్రతినిధి ప్రీతారెడ్డి, యూఎన్ ఎఫ్ పీఏ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నటాలియా కనేం, దావోస్ అల్జీమర్స్ ఛైర్మన్ జార్జ్ రాడెన్ బర్గ్, తదితరులను కలిశారు.
ఐటీ, జీవ వైద్య శాస్త్ర రంగానికి ముఖ్య కేంద్రంగా అభివృద్ధి చెందిన తెలంగాణ బలాలను ప్రపంచానికి చాటి చెప్పేందుకు, భారీ పెట్టుబడులను ఆకర్షించేందుకు తెలంగాణ ప్రతినిధి బృందం తొలి రోజునే పలువురు ప్రముఖులతో కీలక చర్చలు జరిపింది. దావోస్ పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సోమవారం వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రెసిడెంట్ బోర్గ్ బ్రెండెతో సమావేశమయ్యారు.
వరల్డ్ ఎకనామిక్ ఫోరం చీఫ్ తో పాటు నిర్వాహకులు, ఇతర ప్రముఖులతో ముఖ్యమంత్రి రేవంత్ భేటీ అయ్యారు. తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించారు. రాష్ట్రంలో ఏర్పడిన కొత్త ప్రభుత్వం ప్రాధాన్యతలను వివరించారు. ప్రభుత్వాలతో పాటు పారిశ్రామికవేత్తలు, వ్యాపార, వాణిజ్య నాయకత్వం కలిసికట్టుగా పని చేస్తే ప్రజలు సంపన్నులవుతారని, సుస్థిరమైన అభివృద్ధితో పాటు జీవన ప్రమాణాలు మెరుగుపడితే ప్రజలు మరింత ఆనందంగా ఉంటారనే దృక్కోణంలో చర్చలు జరిపారు.
అనంతరం, ఇథియోఫియా ఉప ప్రధాని డెమెక్ హసెంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. పారిశ్రామిక అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం ఎంచుకున్న కార్యాచరణపై చర్చించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబుతో పాటు తెలంగాణ ప్రతినిధి బృందం నేషనల్ అసోషియేషన్ ఆఫ్ సాఫ్ట్ వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీస్ (NASSCOM) ప్రెసిడెంట్ శ్రీమతి దేబ్జానీ ఘోష్‌తో సమావేశమయ్యారు.

రాష్ట్రంలో నైపుణ్యాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించటం, అందుకోసం అనుసరించే భవిష్యత్తు కార్యక్రమాలపై చర్చించారు. ఇంజినీరింగ్, డిగ్రీ కోర్సులు చదువుతున్న యువతకు స్కిల్ డెవెలప్మెంట్, ప్లేస్మెంట్ కమిట్మెంట్, ఉద్యోగ కల్పనకు సాయం అందించే అంశాలపై సంప్రదింపులు జరిపారు. స్విట్జర్లాండ్ లోని దావోస్‌లో వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ 54వ వార్షిక సదస్సు జరుగుతోంది. మూడు రోజుల పాటు ఈ సదస్సు జరుగనుంది.
దావోస్ పర్యటనకు వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబుకు పలువురు ప్రవాసీ భారత ప్రముఖులు ఘన స్వాగతం పలికారు. జ్యూరిచ్ ఎయిర్ పోర్ట్ లో మన దేశానికి చెందిన ప్రముఖులను కలిసి వారితో ముచ్చటించటం సంతోషాన్నిచ్చిందన్నారు రేవంత్ రెడ్డి. సమ్మిళిత, సంతులిత అభివృద్ధి ద్వారా ప్రజలందరి పురోగతి.. నవ తెలంగాణ నిర్మాణానికై మొదలైన తమ ప్రభుత్వ ప్రయత్నంలో భాగస్వాములు కావటం పట్ల ముఖ్యమంత్రి ఆనందం వ్యక్తపరిచారు.
-
మూసీపై కేబినెట్ సబ్ కమిటీ- సభ్యులు వీళ్లే -
మార్కాపురం ప్రమాద ఘటన: చంద్రబాబు దృష్టికి ప్రమాద కారణం, సీఎం రేవంత్ దిగ్భ్రాంతి! -
తెలంగాణాకు వరుణ సందేశం.. ఈ జిల్లాలలో వర్షాలు.. ఎల్లో అలెర్ట్! -
హైదరాబాద్ లో దంచికొడుతున్న భారీ వర్షం.. -
మందుబాబులకు బిగ్ షాక్.. రేపు వైన్ షాప్ లు బంద్.. -
తెలంగాణలో పెట్రోల్, గ్యాస్ కొరత లేదు: క్లారిటీ ఇచ్చిన కమిషనర్! -
నటుడు రాహుల్ రామకృష్ణ ఇంట్లో తీవ్ర విషాదం.. ప్రధాని మోదీకి విన్నపం! -
ఏపీ, తెలంగాణాకు కార్మికులకు గండంగా ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!!











Click it and Unblock the Notifications