డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం!

తెలంగాణలో డ్రైవింగ్ లైసెన్స్ జారీ ప్రక్రియలో కీలక మార్పులకు శ్రీకారం చుడుతుంది తెలంగాణా ప్రభుత్వం. రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా, సుప్రీంకోర్టు ఆదేశిత స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ప్రకారం లైసెన్స్ పొందడం మరింత కఠినతరం అవుతుంది. ఇకపై, లెర్నర్స్ లైసెన్స్ దరఖాస్తుకు ముందే రోడ్డు భద్రతపై ఆన్‌లైన్ అవగాహన పరీక్ష నిర్వహించనున్నారు. ఈ పరీక్షలో ఉత్తీర్ణత తప్పనిసరి. తెలంగాణ రవాణా శాఖ దీని అమలుకు సన్నాహాలు చేస్తోంది.

డ్రైవింగ్ లైసెన్స్ జారీకి మూడు దశల ప్రక్రియ

ప్రస్తుతం డ్రైవింగ్ లైసెన్స్ జారీకి రెండు దశలు ఉన్నాయని, కొత్త విధానంతో ఇది మూడు దశల ప్రక్రియగా మారుతుందని ప్రభుత్వం చెప్తోంది. దీని ప్రకారం, మొదట ఆన్‌లైన్ రోడ్డు భద్రతా అవగాహన పరీక్ష పూర్తి చేయాలి. దీనిపై ఏర్పాటు చేసిన కమిటీ నివేదిక ఏప్రిల్ నెలాఖరు నాటికి వస్తుందని రవాణా శాఖ జాయింట్ కమిషనర్ ఎం. చంద్రశేఖర్ గౌడ్ తెలిపారు. ఈ నివేదిక ఆధారంగా ఆన్‌లైన్ పరీక్షను తప్పనిసరి చేస్తారు.

Telangana plans major reforms in the driving license process with a mandatory online road safety test

ఆరు మాడ్యూల్స్‌గా శిక్షణ ఇచ్చి పరీక్షలు పెట్టనున్న ప్రభుత్వం

ఆన్‌లైన్ శిక్షణ ఆరు మాడ్యూల్స్‌గా ఉంటుంది. ఒక్కో మాడ్యూల్ 30 నిమిషాలు, మొత్తం మూడు గంటలు పడుతుంది. ఇందులో వీడియో ఆధారిత పాఠాలు, రోడ్డు భద్రత, ట్రాఫిక్ నిబంధనలపై శిక్షణ ఇస్తారు. ప్రతి మాడ్యూల్ చివరలో చిన్న పరీక్ష తప్పనిసరి. అభ్యర్థులు ఇంటి వద్ద కెమెరాతో కూడిన ల్యాప్‌టాప్, డెస్క్‌టాప్ లేదా గుర్తింపు పొందిన డ్రైవింగ్ స్కూళ్లలో ఈ పరీక్షలో పాల్గొనవచ్చు.

కోర్సు త్వరాత యూనిక్ సర్టిఫికేట్ నంబర్

ఈ శిక్షణలో ప్రధానంగా రోడ్డు ప్రమాదాలకు కారణాలు, అద్దాల వినియోగం, సురక్షిత ఓవర్‌టేకింగ్ వంటి అంశాలు వివరిస్తారు. వాస్తవ ప్రమాదాల వీడియోలతో డ్రైవర్లు చేసే పొరపాట్లపై అవగాహన కల్పిస్తారు. కోర్సు పూర్తయ్యాక, ఒక యూనిక్ సర్టిఫికేట్ నంబర్ కూడా కేటాయిస్తారు. లెర్నర్స్ లైసెన్స్ దరఖాస్తుకు ఈ నంబర్ తప్పనిసరిగా చెప్తున్నారు.

రోడ్డు భద్రతపై ప్రాథమిక అవగాహన కల్పించే ప్లాన్

భారతదేశంలో ఏటా సుమారు 1.7 లక్షల మంది రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నారు. తెలంగాణలోనూ మరణాల సంఖ్య ఆందోళనకరం. లైసెన్స్ జారీ ముందే రోడ్డు భద్రతపై ప్రాథమిక అవగాహన కల్పించడం బాధ్యతాయుతమైన డ్రైవర్లను తయారు చేస్తుందని అధికారులు భావిస్తున్నారు. ఈ డిజిటల్ విధానం దళారీల ప్రమేయాన్ని తగ్గించి, రవాణా కార్యాలయాల్లో పారదర్శకత పెంచుతుందని రవాణా శాఖ ఆశిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+