సైబర్ నేరాల నియంత్రణలో దేశంలోనే తొలిస్థానంలో తెలంగాణా!

ప్రస్తుతం పోలీసులకు శాంతిభద్రతల పరిరక్షణ కంటే, సైబర్ నేరాలను నియంత్రించడమే పెద్ద పనిగా మారింది. రోజురోజుకు పెరుగుతున్న సైబర్ నేరాలను కట్టడి చేయడానికి, ప్రజలలో కూడా అవగాహన అవసరమని, పెద్ద ఎత్తున గాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇక సైబర్ నేరాల కట్టడిలో దేశంలోనే తెలంగాణ పోలీసులు శభాష్ అనిపించుకుంటున్నారు.

సైబర్ నేరాల నియంత్రణలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే టాప్

సైబర్ నేరాల నియంత్రణలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే టాప్ లో ఉండడం అందుకు నిదర్శనం . తాజాగా ప్రధానమంత్రి కార్యాలయం నిర్వహించిన జాతీయస్థాయి ప్రగతి సమీక్ష సమావేశంలో ఈ గణాంకాలను విడుదల చేశారు. సైబర్ నేరాల నియంత్రణలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పనితీరును అంచనా వేసేందుకు తొమ్మిది ప్రామాణికాలను పరిగణనలోకి తీసుకున్నారు. ఇందులో అన్ని రాష్ట్రాలను దాటేసి తెలంగాణ ఫస్ట్ ప్లేస్ సాధించటం రాష్ట్ర పోలీస్ శాఖకు గర్వకారణంగా నిలిచింది.

Telangana police Ranks First in India in Cyber Crime Control PMO Praises telangana cyber policing

తొమ్మిది ప్రామాణికాల ఆధారంగా పనితీరు అంచనా

సైబర్ కమాండ్ సెంటర్ ఎస్ ఫోర్ సి ఏర్పాటు, ఈ జీరో ఎఫ్ఐఆర్ అమలు, గ్రీవెన్స్ రిడ్రేసల్ మాడ్యూల్, రిఫండ్ కోసం మనీ రెస్టోరేషన్ మాడ్యూల్. సహయోగ్ పోర్టల్, సమన్వయ పోర్టల్, సైబర్ క్రైమ్ హాట్ స్పాట్ ల గుర్తింపు, చట్టం అమలులో అధికారుల సామర్థ్య నిర్మాణం, అలాగే సమాచారం, విద్య, ప్రచారం వంటి తొమ్మిది ప్రామాణికాలను పరిగణలోకి తీసుకొని పనితీరును అంచనా వేశారు.

టాప్ లో తెలంగాణా.. ప్రశంసించిన పీఎంవో

ఇందులో తెలంగాణ టాప్ లో నిలిచింది. దేశంలోనే మొట్టమొదటిసారిగా సైబర్ కమాండ్ సెంటర్ ను ఏర్పాటు చేసిన రాష్ట్రం కూడా తెలంగాణ కావడం గమనార్హం. తెలంగాణ రాష్ట్ర పోలీసులను, కీలక పోర్టల్ లేని సమర్థవంతంగా ఉపయోగించడంలో వారు చూపించిన కృషిని ఈ మేరకు పీఎంఓ ప్రశంసించింది.

ఉత్తర తెలంగాణ వరప్రదాయిని వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిపై బిగ్ న్యూస్!
ఉత్తర తెలంగాణ వరప్రదాయిని వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిపై బిగ్ న్యూస్!

తెలంగాణా పోలీసుల విజయం: సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్

ఇక తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్ తెలంగాణ పోలీసులు, సైబర్ సెక్యూరిటీ వింగ్ సాధించిన ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. సైబర్ నేరాలు రోజురోజుకు పెరుగుతున్న క్రమంలో రాష్ట్ర పోలీస్ యంత్రాంగం తీసుకుంటున్న చర్యలు మంచి ఫలితాలను ఇస్తున్నాయని ఆమె అన్నారు. ఈ విజయం కేవలం సంఖ్యాపరమైన ర్యాంక్ మాత్రమే కాదు, సైబర్ నేరాల నుండి ప్రజలను రక్షించడానికి తెలంగాణ చూపిస్తున్న నిబద్ధతకు నిదర్శనమని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ పేర్కొన్నారు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+