TSLPRB: ఎస్‌ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు అలర్ట్.. ప్రిలిమినరీ పరీక్షల తేదీలు విడుదల..
తెలంగాణలో ఎస్‌ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు నిర్వహించబోయే ప్రిలిమినరీ పరీక్షల తేదీలు విడుదలయ్యాయి.ఆగస్టు 7న ఎస్సై, ఆగస్టు 21న కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలంగాణం పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు వెల్లడించింది. ఎస్సై రాత పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు ఈ నెల 30 నుంచి, కానిస్టేబుల్ అభ్యర్థులు ఆగస్టు 10 నుంచి హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చని తెలిపింది. బోర్డు వైబ్‌సైట్ www.tslprb.inలో హాల్‌టికెట్లు అందుబాటులో ఉంటాయని తెలిపింది.ఈ పరీక్షలు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరగుతాయని పేర్కొంది.
ఏప్రిల్ 25న 554 ఎస్సై, 15,644 కానిస్టేబుల్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. ఎస్సై కొలువుకు దాదాపు 2.54 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నట్లు తెలిసింది. కానిస్టేబుల్ పోస్టులకు 6.50 లక్షల మంది ఆప్లికేషన్ పెట్టుకున్నారు.













Click it and Unblock the Notifications