TS POLLS:వెల్లువెత్తుతున్న సర్వేలు..కాంగ్రెస్ పై అంచనాలు..!!

కేంద్ర ఎన్నికల సంఘం సర్వేలపై నిషేధం విధించినా అక్కడక్కడ కొన్ని సంస్థలు తమ సర్వేలతో ప్రజలను కన్ఫ్యూజ్ చేస్తున్నాయి. సర్వేలతో ఓటర్ల మనసులో ముద్ర వేసేందుకు రాజకీయ పార్టీలు ప్రయత్నం చేసే క్రమంలో ఆ ప్రయత్నాలకు ఎన్నికల సంఘం చెక్ పెట్టింది. ఎన్నికల సమయంలో ఎటువంటి సర్వేల ఫలితాలు ఇవ్వకూడదని ప్రకటించింది. అయితే తాజాగా లోక్ పోల్ సర్వే ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Telangana polls: Lokpal survey goes viral on social media, predictions here

ఈ సర్వేలో తెలంగాణ రాష్ట్రంలో ఏ పార్టీకి ఎన్ని స్థానాలు వస్తాయనేది ప్రకటించడం ప్రస్తుతం ఆసక్తిని రేకెత్తిస్తుంది.సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న లోక్‌పోల్‌ సర్వేలో కాంగ్రెస్‌దే హవా అని తేల్చింది. 69-72 స్థానాలతో కాంగ్రెస్‌దే పీఠం అని ప్రకటించింది. అంతేకాదు బీఆర్‌ఎస్‌ 36-39 సీట్లకే పరిమితం అవుతుందని వెల్లడించింది. బీజేపీకి 2-3 స్థానాలు దక్కుతాయని, మజ్లిస్‌కు ఆరు స్థానాలు దక్కుతాయని పేర్కొంది.

Telangana polls: Lokpal survey goes viral on social media, predictions here

ఇంకా మజ్లిస్‌ నాంపల్లి సీటు కోల్పోనున్నట్టు పేర్కొంది. నల్లగొండ, ఖమ్మం, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో కాంగ్రెస్‌ ఏకపక్ష విజయం సాధిస్తుందని పేర్కొంది. గ్రేటర్‌'లోనూ బీఆర్‌ఎస్‌కు భంగపాటు తప్పదని లోక్ పోల్ పేర్కొంది. ఇక లోక్ పోల్ ప్రధానంగా నల్లగొండ- ఖమ్మం జిల్లాల్లో బీఆర్‌ఎస్‌కు ఒక్క స్థానం కూడా వచ్చే అవకాశం లేదని తేల్చేసింది.

తాజా సర్వే ఫలితాలు అధికార బీఆర్‌ఎస్‌కు పూర్తి స్ధాయిలో నిరాశ కలిగించే అంశమని ప్రధానంగా కనిపిస్తుంది. ప్రతిపక్షానికి పరిమితమవుతుందన్న వార్త బీఆర్ఎస్ కు శారాఘాతమని తెలుస్తుంది. లోక్ పోల్ నివేదిక కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ ఇస్తుంది. ఇప్పటికే పుంజుకున్న కాంగ్రెస్ కు మరింత జవసత్వాలు నింపేలా ఉంది.

అయితే ఎన్నికల సంఘం ఎలాంటి సర్వేలను ఇవ్వకూడదని ఆదేశాలు జారీ చేసినా, ఎన్నికల సంఘం సర్వేలపై విధించిన నిషేధాన్ని తుంగలో తొక్కి లోక్ పోల్ పేరుతో వైరల్ గా మారిన ఈ సర్వేపై ఇప్పుడు ఆసక్తికర చర్చ జరుగుతుంది. ఎన్నికల సంఘం ఈ సర్వేపై ఏం నిర్ణయం తీసుకుంటుందో తెలియాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+