తెలంగాణాలో నేడు ఈ జిల్లాలలో భారీ వర్షాల హెచ్చరిక

తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు మళ్లీ ఊపందుకున్నాయి. ఎల్ నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొంటున్న క్రమంలో తాజాగా వాయవ్య బంగాళాఖాతం పరిసరాల్లో ఏర్పడిన అల్పపీడనం, దానికి అనుబంధ ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వాతావరణం మారిపోయింది. ఆదివారం ఉత్తర, మధ్య తెలంగాణ జిల్లాల్లో విస్తారంగా వర్షపాతం నమోదైంది.

నిన్న ఈ ప్రాంతాల్లో వర్షాలు

నిన్న తెలంగాణా రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లా నిజాంపేటలో అత్యధికంగా 6.5 సెంటీమీటర్ల వర్షం కురిసింది. కామారెడ్డి జిల్లా పిట్లం, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా మల్కాజిగిరిలో 5.1 సెం.మీ. చొప్పున నమోదైంది. మెదక్ జిల్లా నర్సాపూర్‌లో 4.7 సెం.మీ., పెద్దపల్లి జిల్లా శ్రీరాంపూర్, ముత్తారంలో 4.5 సెం.మీ., సంగారెడ్డి కల్హేర్, మెదక్ టేక్మల్‌లో 4.2 సెం.మీ., కామారెడ్డి బిచ్కుందలో 3.8 సెం.మీ. వర్షపాతం నమోదైంది.

telangana rains IMD has stated that heavy rains are likely in several districts today issued yellow alert

హైదరాబాద్ లో కూలిన భారీ చెట్టు

జయశంకర్ భూపాలపల్లి, ములుగు, యాదాద్రి భువనగిరి, జగిత్యాల జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు జల్లులు కురిశాయి. వర్షాల ప్రభావంతో హైదరాబాద్‌లో ప్రమాదం చోటు చేసుకుంది. ఆర్బీఐ రోడ్డుపై రవీంద్రభారతి సమీపంలో తెల్లవారుజామున భారీ చెట్టు నేలకూలింది. విద్యుత్ స్తంభం విరిగి పడి ఆటో పూర్తిగా ధ్వంసమైంది. అయితే డ్రైవర్ సమయానికి తప్పించుకోవడంతో ప్రాణాపాయం తప్పింది.

నేడు వర్షాలు పడే జిల్లాలు ఇవే

ఇక నేడు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, కామారెడ్డి, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, హన్మకొండ, వరంగల్, జనగాం, మహబూబాబాద్, నాగర్‌కర్నూల్, యాదాద్రి భువనగిరి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ లోనూ అనేకప్రాతాలలో నేడు వర్షాలు కురుస్తున్నాయి.

జనసేన వైపు కొండా సుస్మిత చూపు.. హైకమాండ్ ఆ పని చేస్తే!
జనసేన వైపు కొండా సుస్మిత చూపు.. హైకమాండ్ ఆ పని చేస్తే!

ఈ జిల్లాలలోనూ వర్ష సూచనలు

గంటకు 40 కి.మీ. వేగంతో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు సూచనలు ఉన్నందున ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. వర్షం పడే సమయంలో బయటకు రాకుండా ఉంటేనే మంచిదని వాతావరణ శాఖ పేర్కొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+