తెలంగాణాలో మూడు రోజులపాటు వర్షాలు.. కబురు పంపిన బంగాళాఖాతం!

బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో రానున్న మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రంలో నేటి నుండి 9వ తేదీ వరకు మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

తెలుగురాష్ట్రాలపైన ఉపరితల ఆవర్తన ప్రభావం

తెలంగాణ రాష్ట్రంలో పలు జిల్లాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. సముద్రమట్టం వద్ద ఉన్న ఋతుపవన ద్రోణి ప్రస్తుతం గంగానగర్, ఢిల్లీ, హమీర్పూర్, రాంచీ మీదుగా కొనసాగుతూ ఆగ్నేయదిశగా తూర్పు మధ్య బంగాళాఖాతం వైపు విస్తరించి ఉంది. మరోవైపు ఆగ్నేయ బంగాళాఖాతం మీదగా సముద్రమట్టానికి 4.5నుంచి 5.8కిలోమీటర్ల ఎత్తులో ఉన్న ఉపరితల ఆవర్తనం బలహీన పడినప్పటికీ దీని ప్రభావం తెలుగురాష్ట్రాలపైన కొనసాగుతుంది.

Telangana rains IMD issues heavy rain alert for next three days due to Bay of Bengal surface

రాష్ట్ర వ్యాప్తంగా ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు

ఉపరితల ఆవర్తన ప్రభావంతో పాటు, రుతుపవన ద్రోణి కారణంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. అదేవిధంగా బలమైన ఉపరితల గాలులు కూడా వీయవచ్చని వెల్లడించింది.

తెలంగాణలో లోటు వర్షపాతం.. వర్షాలపై ఆశాభావం

ఇదిలా ఉంటే ఇప్పటికే తెలంగాణలోని కొన్ని జిల్లాలలో వర్షాలు కురుస్తున్నాయి. గత కొద్దిరోజులుగా వాయువ్య బంగాళాఖాతం మరియు ఉత్తర ఒడిస్సా ప్రాంతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా రాష్ట్రంలో వర్షాలు నమోదవుతున్నాయి. అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదు అయినప్పటికీ ప్రస్తుతం ఇంకా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది.

ఆహారకల్తీ ముఠాలపై కూంబింగ్.. 100మంది పోలీసులతో ఎన్ఫోర్స్మెంట్ టీం: డీజీపీ సీవీ ఆనంద్
ఆహారకల్తీ ముఠాలపై కూంబింగ్.. 100మంది పోలీసులతో ఎన్ఫోర్స్మెంట్ టీం: డీజీపీ సీవీ ఆనంద్

నేడు ఈ జిల్లాలలో వర్షాలు

ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని ఆ మూడు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలను జారీ చేసినట్టుగా పేర్కొంది. హైదరాబాద్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. రానున్న రెండు రోజులు కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుందని రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాలలో అడపాదడపా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+