తెలంగాణా ఊపిరి తీసుకో... వర్షాల కబురు చెప్పిన ఐఎండీ

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులు ఉండడంతో వర్షాల కోసం అన్నదాతలు అల్లాడిపోతున్నారు. తెలంగాణ రాష్ట్రానికి నైరుతి రుతుపవనాలు వచ్చిన నాటి నుండి జోరుగా వర్షాలు కురుస్తాయని భావిస్తే పరిస్థితి అందుకు భిన్నంగా తయారైంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలలోనూ ఊహించని విధంగా తక్కువ వర్షపాతం నమోదయింది.

అల్పపీడనంతో పాటు మరో ద్రోణి

ప్రస్తుతం వారం రోజులపాటు వర్షాలు పడే అవకాశం లేదని వాతావరణ శాఖ చెప్పిన క్రమంలో ఒక్కసారిగా మళ్లీ వాతావరణం మారింది. ఈ క్రమంలో తెలంగాణకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. బంగాళాఖాతంలో ఉత్తర ఒడిశా- పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతంలో అల్పపీడనం తోపాటు మరో ద్రోణి ఏర్పడడం వల్ల రాష్ట్రంలో పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

Telangana rains imd said rains in telangana districts with bay of bengal low pressure and mansoon

ఈ ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం

ఈరోజు ఉత్తర, మధ్య తెలంగాణలో పలు జిల్లాలలో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. తెలంగాణ జిల్లాలలో పలు చోట్ల జల్లులతో పాటు ఉరుములు, మెరుపులు , బలమైన ఈదురుగాలులు వీస్తాయని అంచనా వేసింది. శుక్రవారం తెల్లవారుజామున హైదరాబాద్ లో కూడా వర్షం కురిసింది. నేడు హైదరాబాద్ లో వాతావరణం వర్షం పడేలా ఉంది. ఆకాశం మేఘావృతమై కనిపిస్తుంది.

నిన్న ఈ జిల్లాలలో వర్షాలు

నిన్న రంగారెడ్డి జిల్లాలో 4.3 సెంటీమీటర్లు, నల్గొండ జిల్లా చండూరులో 3.5 సెంటీమీటర్లు వర్షం కురిసింది. గత 24 గంటల్లో తెలంగాణలోని రంగారెడ్డి, సంగారెడ్డి, నారాయణపేట, మహబూబ్నగర్, భూపాలపల్లి, ములుగు, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలలో పలుచోట్ల వర్షాలు కురిశాయి. రాష్ట్రంలో అనేక జిల్లాలు నిన్న అధిక ఉష్ణోగ్రతలను చూశాయి. ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాలో 35.5 డిగ్రీలో ఉష్ణోగ్రత నమోదయింది.

22వ తేదీ వరకు జల్లులు కొనసాగే అవకాశం

ఇదిలా ఉంటే మళ్ళీ తెలంగాణ జిల్లాలలో, ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలో జల్లులు పడే అవకాశం ఉందని, బలమైన ఉపరితల గాలులు వీస్తాయని ఈనెల 22వ తేదీ వరకు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలకు అవకాశం లేదని కూడా వాతావరణ శాఖ వెల్లడించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+