telangana rains: మూడురోజులు అత్యంత భారీవర్షాలు; హైదరాబాద్ లో రెడ్ అలెర్ట్.. తాజా అప్డేట్!!
అల్పపీడన ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే గత కొద్ది రోజులుగా వర్షాలు కురుస్తున్న పరిస్థితులు ఉండగా తాజాగా పలు జిల్లాలలో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. నేటి నుండి మూడు రోజులపాటు భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేయడంతో పాటు హైదరాబాద్ కు కూడా రెడ్ అలర్ట్ ప్రకటించింది.
అయితే రాష్ట్రవ్యాప్తంగా ఈ మూడు రోజులు పాటు వాతావరణం దృష్ట్యా మోడల్ ఆరెంజ్ అలర్ట్ ను జారీ చేసింది. బంగాళాఖాతంలో ఎగువ వాయుగుండం ఊపందుకోవడంతో ఇప్పటికే హైదరాబాద్ లో భారీ వర్షం కురిసింది. తాజా వాతావరణ శాఖ అలర్ట్ నేపథ్యంలో నేడు వరంగల్, మహబూబాబాద్, హన్మకొండ జిల్లాలలో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది.

ఇక మిగిలిన జిల్లాలలోనూ మూడు రోజులపాటు భారీ వర్షాలు కురవనున్నాయి. ఈ మూడు రోజులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. మరోవైపు హైదరాబాద్ లోని భారీ వర్షం కురుస్తున్న నేపథ్యంలో రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. తీవ్రమైన ట్రాఫిక్ జామ్ నగర వాసులను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, జీహెచ్ఎంసి పరిధిలో భారీ వర్షం కురుస్తోంది.నగరంలోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తోంది. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం కురవడంతో చెట్లు నేలకూలి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. మరోవంక భారీ వర్షం కారణంగా వాహనాల రాక పోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మరో వంక హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై భారీవర్షం కారణంగా వాహనాల రాకపోకలకు ఇబ్బంది ఏర్పడింది. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది.
ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు అప్రమత్తమయ్యారు. నగరంలోని ప్రజలకు అనవసరమైన ప్రయాణాలకు దూరంగా ఉండాలని అవసరమైతేనే బయటకు రావాలని చేస్తున్నారు. డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ బృందాలను కూడా అప్రమత్తం చేసినట్టు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఆఫ్ విజిలెన్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ పేర్కొంది. ముంపుప్రాంతాల ప్రజలు సహాయం కోసం టెలిఫోన్ ద్వారా జిహెచ్ఎంసి ని కూడా సంప్రదించవచ్చని, కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేసినట్టుగా పేర్కొంది.
తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న కారణంగా అప్రమత్తంగా ఉండాలన్నారు. మరోవైపు సీఎం కేసీఆర్ కూడా తెలంగాణ లో వర్ష పరిస్థితులపై నిర్వహించి అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు.












Click it and Unblock the Notifications