హైదరాబాద్ కు వరుణుడి వార్నింగ్

వర్షాకాలం కావడంతో తెలంగాణ రాష్ట్రంలోనూ వర్షాలు కురుస్తున్నాయి. ఇక తెలంగాణ రాష్ట్రంలో మరో నాలుగు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని, 14,15తేదీలలో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఒకపక్క ఏపీలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని, ఇటు తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రస్తుతం మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

నేడు ఈ జిల్లాలలో వర్షాలు
ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, కొత్తగూడెం, నిర్మల్, భూపాలపల్లి, ములుగు జిల్లాలలో వర్షాలు పడతాయని పేర్కొంది. ఇక హైదరాబాదులోనూ తేలికపాటి వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అలెర్ట్ ఇచ్చింది. సికింద్రాబాద్ లో కూడా వర్షాలు నమోదు అవుతాయని వెల్లడించింది.

Telangana rains update moderate rainfall today in some districts imd alert

రాత్రి హైదరాబాద్ లో దంచికొట్టిన వాన
ఇదిలాఉంటే తెలంగాణ రాష్ట్రంపై క్యుములోనింబస్ మేఘాలు ఉన్నాయని, వాటి వల్ల వర్షం కురిసే చోట భారీ వర్షం కురిసే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ చెబుతోంది. నగరంలోని పలు ప్రాంతాల్లో నిన్న రాత్రి ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసాయి. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, హైటెక్ సిటీ, మణికొండ, అమీర్పేట్, పంజాగుట్ట, ఫిలింనగర్, షేక్ పేట, భరత్ నగర్, బోరబండ, మలక్ పేట, కోఠీ, దిల్సుఖ్నగర్ ప్రాంతాలలో కుండపోత వర్షం కురిసింది.

హైదరాబాద్ లో నేడు వర్షం పడే చాన్స్
ఇక ఉప్పల్, ఎల్బీనగర్, ఎస్ఆర్ నగర్ లో కూడా భారీ వర్షం కురిసింది. భారీ వర్షంతో నగరంలోని పలు ప్రాంతాలు, రోడ్లు జలమయమయ్యాయి. దీంతో నగరంలో వాహనదారులు వర్షం సమయంలో ప్రయాణం చేయడానికి ఇబ్బందిని ఎదుర్కొన్నారు. ఇక నేడు కూడా హైదరాబాద్లో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. వర్షం పడే సమయంలో బయటకు వెళ్లకుండా ఉండాలని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ సూచిస్తుంది.

తెలంగాణాలో విస్తారంగా వర్షాలు
ఇదిలా ఉంటే తెలంగాణా రాష్ట్ర వ్యాప్తంగా జులై నెల నుండి విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో చెరువులు, రిజర్వాయర్లు జల కళను సంతరించుకున్నాయి. వాగులు, వంకలలోకి నీరు చేరింది. నిన్న కూడా చాలా జిల్లాలలో వర్షం కురిసింది, రైతులు కూడా వ్యవసాయ పనులను జోరుగా సాగిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+