తెలంగాణలో మొదటికొచ్చిన కరోనా: అక్కడే అత్యధిక కేసులు
హైదరాబాద్: ప్రాణాంతక కరోనా వైరస్ కథ మళ్లీ మొదటికొచ్చింది. తెలంగాణలో రోజురోజుకూ కొత్త కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. మహారాష్ట్ర, ఢిల్లీ వంటి కొన్ని రాష్ట్రాల్లో కొత్త కేసులు వెలుగులోకి వస్తోన్నాయి. ఈ పరిణామాలతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. గతానుభవాలను దృష్టిలో ఉంచుకుని ముందుజాగ్రత్త చర్యలను తీసుకోవడానికి సమాయాత్తమౌతోంది.
తెలంగాణలో 24 గంటల వ్యవధిలో కొత్తగా 41 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. వారు వేర్వేరు ఆసుపత్రులు, కోవిడ్ సెంటర్లల్లో చికిత్స పొందుతున్నారు. 30 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటిదాకా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 8,43,003కు చేరుకుంది. ఇందులో సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకుని, ఇళ్లకు వెళ్లిన వారు 8,38,623 మంది ఉన్నారు. 4,111 మంది మృత్యువాత పడ్డారు.

రాష్ట్రవ్యాప్తంగా యాక్టివ్‌గా ఉన్న కేసుల సంఖ్య 269గా నమోదైంది. ఈ మేరకు తెలంగాణ వైద్య మంత్రిత్వ శాఖ అధికారులు ఓ బులెటిన్ చేశారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కొత్తగా 19 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. వారం రోజులుగా కేసుల సంఖ్యను చూస్తే.. 11వ తేదీన 12 కేసులు నమోదయ్యాయి. 12వ తేదీన- 14, 13వ తేదీన- 18, 14వ తేదీన- 19, 15వ తేదీన 8, 16వ తేదీన- 12, 17వ తేదీన 19 కేసులు రికార్డయ్యాయి.
అటు దేశవ్యాప్తంగా కొత్తగా నమోదవుతున్న కోవిడ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతూ వస్తోంది. సోమవారం విడుదల చేసిన బులెటిన్ ప్రకారం.. కొత్తగా 9,111 కొత్త కరోనా వైరస్ ఇన్ఫెక్షన్లు నమోదయ్యాయి. యాక్టివ్ కేసుల సంఖ్య 60 వేలను అధిగమించింది. 60,313గా నమోదైంది. 27 మంది మృత్యువాత పడ్డారు. దీనితో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 5,31,141కి పెరిగింది.
అత్యధికంగా గుజరాత్‌లో ఆరు మంది మరణించారు. ఉత్తరప్రదేశ్‌లో నలుగురు, ఢిల్లీ, రాజస్థాన్‌లల్లో ముగ్గురు చొప్పున, మహారాష్ట్రలో ఇద్దరు, బిహార్, ఛత్తీస్‌గఢ్, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, కేరళ, తమిళనాడుల్లో ఒక్కొక్కరు మృతి చెందారు. ఈ పరిణామాలతో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అప్రమత్తమైంది. దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన ఆసుపత్రుల్లో కోవిడ్ మాక్ డ్రిల్స్‌ను నిర్వహించింది. కోవిడ్ వార్డులను అందుబాటులోకి తీసుకొచ్చింది.












Click it and Unblock the Notifications