రాష్ట్ర చరిత్రలోనే అత్యధిక పవర్ వినియోగంపై డిప్యూటీ సీఎం పవర్‌ఫుల్ కామెంట్స్!
తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఎలాంటి అంతరాయాలు లేకుండా అత్యధిక డిమాండ్ ఉన్నప్పటికీ విద్యుత్ సరఫరా చేసిన ఘనత ఎన్పీడీసీఎల్ నమోదు చేసింది. ఈరోజు ఇప్పటివరకు ఎన్నడూ లేనంత అత్యధిక విద్యుత్ డిమాండ్ నమోదైంది. రాష్ట్రంలో రికార్డు స్థాయిలో 18,139 మెగావాట్ల విద్యుత్ అవసరం ఏర్పడగా, విద్యుత్ శాఖ అధికారులు విజయవంతంగా సరఫరా నిర్వహించారు.
అత్యధిక విద్యుత్ డిమాండ్ పై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, సాగు అవసరాలు, గృహ మరియు పారిశ్రామిక వినియోగం పెరగడం వంటి కారణాలతో విద్యుత్ వినియోగం గణనీయంగా పెరిగిందని అధికారులు తెలిపారు.రికార్డు స్థాయి డిమాండ్ ఉన్నప్పటికీ ఎక్కడా అంతరాయం లేకుండా సరఫరా కొనసాగించగలిగామని ప్రభుత్వం స్పష్టం చేసింది. భవిష్యత్తులో మరింత పెరుగనున్న విద్యుత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని అవసరమైన ఏర్పాట్లు చేసుకున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు.

రికార్డ్ డిమాండ్ ఉన్నా ఇబ్బంది లేకుండా సరఫరా
రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడంతో పాటు, ట్రాన్స్‌మిషన్ మరియు డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థలను బలోపేతం చేసిన ఫలితంగా ఈ రికార్డు డిమాండ్‌ను సమర్థవంతంగా ఎదుర్కొనగలిగిందని ఆయన పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా వ్యవసాయం, పరిశ్రమలు, గృహ వినియోగదారుల అవసరాలకు అంతరాయం లేకుండా విద్యుత్ అందించేందుకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు.
ఎన్పీడీసీఎల్ చరిత్రలోనే విద్యుత్ వినియోగం గరిష్టస్థాయికి :సీఎండీ
ఈ పరిణామం తెలంగాణ విద్యుత్ రంగ సామర్థ్యానికి నిదర్శనమని అధికార వర్గాలు అభిప్రాయపడ్డాయి. కాగా ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి ఎన్పీడీసీఎల్ చరిత్రలోనే విద్యుత్ వినియోగం సరికొత్త గరిష్ట స్థాయిని చేరిందని పేర్కొన్నారు. నేడు సంస్థ పరిధిలోని 6,441 మెగావాట్ల అత్యధిక విద్యుత్ డిమాండ్ నమోదయిందని, రికార్డు స్థాయి డిమాండ్ ఉన్నప్పటికీ విద్యుత్ సరఫరా చేయడంలో ఎక్కడ ఇబ్బంది లేకుండా చేయగలిగామని ఆయన పేర్కొన్నారు.
సంస్థ చరిత్రలోనే లిఖించదగిన రోజు
నేడు సంస్థ చరిత్రలోనే లిఖించదగిన రోజు అని వ్యాఖ్యానించారు. నిన్న కూడా 6,273 మెగావాట్ల రికార్డును రికార్డును ఎన్పీడీసీఎల్ నమోదు చేసింది. పెరుగుతున్న ఉష్ణోగ్రతల దృష్ట్యా విద్యుత్ వినియోగం భారీగా పెరుగుతుందని, ముందు ముందు మరింత విద్యుత్ డిమాండ్ చోటు చేసుకునే పరిస్థితి లేకపోలేదని cmd వరుణ్ రెడ్డి స్పష్టం చేశారు.
డిమాండ్ ఎంత ఉన్నా అవాంతరాలు లేని విద్యుత్ సరఫరా
డిమాండ్ ఎంత ఉన్నప్పటికీ వినియోగదారులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా నిరంతరం విద్యుత్ సరఫరా చేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. వేసవి కాలంలో ఎదురయ్యే విద్యుత్ డిమాండ్ ను ఎదుర్కోవడానికి తాము పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ముందస్తు ప్రణాళికలతో, సాంకేతిక సమస్యలు తలెత్తకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్టు వెల్లడించారు.












Click it and Unblock the Notifications