తెలంగాణలో కొత్తగా 4009 కరోనా కేసులు... మరో 14 మంది మృతి...
తెలంగాణలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. గత కొద్దిరోజులుగా వరుసగా 4వేల మార్క్‌ను దాటుతున్నాయి. శనివారం(ఏప్రిల్ 17) రాత్రి 8గం. నుంచి ఆదివారం రాత్రి 8గం. వరకు 4009 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో 14 మంది కరోనాతో మృతి చెందారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ సోమవారం(ఏప్రిల్ 19) హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.
మరో 5104 రిపోర్టులు ఇంకా రావాల్సి ఉంది. తాజా కేసులతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,55,433కి చేరింది. మొత్తం మృతుల సంఖ్య 1838కి చేరింది. ప్రస్తుతం 39,154 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 1878 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ఇప్పటివరకూ రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 3,14,441కి చేరింది.

ప్రస్తుతం దేశంలో మరణాల రేటు 1.2శాతం ఉండగా... తెలంగాణలో 0.51శాతం ఉంది. జాతీయ స్థాయిలో రికవరీ రేటు 86 శాతం ఉండగా తెలంగాణలో 88.46 శాతం ఉంది. తాజాగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 705 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటివరకూ 1,18,20,842 కరోనా టెస్టులు నిర్వహించారు.
దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 2,73,810 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 150,61,919కి చేరింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 19,29,329 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో మరో 1,625 మంది కరోనాతో మృతి చెందారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 178,793.కి చేరింది. ప్రస్తుతం 32,404,454 కరోనా కేసులతో అమెరికా ప్రపంచంలోనే అగ్ర స్థానంలో కొనసాగుతోంది. ఆ తర్వాతి స్థానాల్లో భారత్,బ్రెజిల్ ఉన్నాయి.
గాలి ద్వారా కూడా కరోనా వ్యాప్తి చెందుతున్నట్లు పలు అధ్యయనాలు వెల్లడించిన సంగతి తెలిసిందే. మొదటి కరోనా వేవ్ కంటే సెకండ్ వేవ్ మరింత వేగంగా వ్యాప్తి చెందుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే ఆస్పత్రులపై ఒత్తిడి పెరిగి పడకలు,ఆక్సిజన్ దొరకని పరిస్థితి నెలకొంది. చాలా రాష్ట్రాలు కరోనా కట్టడికి రాత్రిపూట కర్ఫ్యూ,వీకెండ్ లాక్‌డౌన్ అమలుచేస్తున్నాయి. అయినప్పటికీ కరోనా ఉధృతికి తెరపడకపోవడం భయాందోళనకు గురిచేస్తోంది. ప్రజలు అత్యవసరమైతే ఇళ్ల నుంచి బయటకు రావొద్దని.. మాస్కులు ధరించడం,భౌతిక దూరం పాటించడం మరవద్దని ప్రభుత్వాలు పదే పదే విజ్ఞప్తి చేస్తున్నాయి.












Click it and Unblock the Notifications