అంగన్ వాడీలకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్
తెలంగాణలోని విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయాలు తీసుకుంటోంది. ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల్లో ఎల్ కేజీ, యూకేజీ, ప్రీ ప్రైమరీ క్లాసులు ప్రారంభించగా.. తాజాగా అంగన్ వాడీ కేంద్రాలను బలోపేతం చేసే దిశగా నిర్ణయాలు తీసుకుంటోంది. చిన్నారులకు పౌష్టికాహారం అందించేందుకు కొత్త మెనూ సిద్ధం చేస్తోంది. ఈ మేరకు అంగన్ వాడీ కేంద్రాలకు వచ్చే పిల్లలకు తప్పని సరిగా పాలు అందించనుంది. అలాగే ఉదయం టిఫిన్ కింద ఉప్మా పెట్టనుంది.
రాష్ట్రంలోని పిల్లలకు పౌష్టికాహారం అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధం అవుతోంది. అంగన్ వాడీ కేంద్రాల్లోని చిన్నారులకు ప్రస్తుతం ఒక పూట భోజనం, ఒక గుడ్డు అందిస్తున్నారు. దీనికి తోడు ఇకపై రోజూ 100 మి.లీ పాలు, అల్పాహారం కింద ఉప్మా అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం అవుతోంది. ఇటీవల అంగన్ వాడీ కేంద్రాలు ప్రారంభం అయినప్పుడు మొదటి రోజు చిన్నారులకు ఎగ్ బిర్యానీ పెట్టారు. మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఆదేశాల మేరకు తొలి రోజు పిల్లలకు ఎగ్ బిర్యానీ పెట్టారు. అంగన్ వాడీ కేంద్రాల్లో ఎగ్ బిర్యానీ పెట్టడం తెలంగాణ చరిత్రలో ఇదే మొదటిసారని పలువురు అభిప్రాయపడ్డారు.
తెలంగాణలోని అంగన్ వాడీ కేంద్రాలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టిసారించింది. ముఖ్యంగా చిన్నారుల ఆహారంపై ఫోకస్ పెట్టింది. ఈ మేరకు అంగన్ వాడీ కేంద్రాల్లో రోజూ 100 మి.లీ పాలు అందించనుంది. అదనపు పోషకాల కోసం పిల్లలు, మహిళలు, కౌమారదశ బాలికలకు కొత్తగా తృణధాన్యాలతో ఆహారం, అంగన్ వాడీ కేంద్రాల్లో మధ్యాహ్న భోజనంతో పాటు ఉదయం వేళల్లో ఉప్మా, ఉగ్గానీతో అల్పాహారం. అంతేకాక తెలంగాణ వ్యాప్తంగా 100 రోజుల న్యూట్రిషన్ ప్రోగ్రాం నిర్వహించనుంది.

ఇక ఈ ఏడాది రాష్ట్రంలో కొత్తగా 1148 అంగన్వాడీ భవనాలను నిర్మించనుంది ప్రభుత్వం. అయితే ఈ నిర్మాణానికి ఇప్పటికే 813 స్థలాలను అధికారులు గుర్తించారు. మిగిలిన చోట్ల స్థలాల గుర్తింపు పెండింగ్ లో ఉంది. మరోవైపు రాష్ట్రంలో ఈ ఏడాది కొత్తగా 571 పాఠశాలలు నిర్మించనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల తెలిపారు. రాష్ట్రంలో 20 మంది కన్నా ఎక్కువ పిల్లలున్న గ్రామాలు, పట్టణాల్లో ఈ ఏడాది కొత్తగా 571 పాఠశాలలను ప్రారంభిస్తున్నామని.. విద్యార్థులకు విషయ పరిజ్ఞానంతో పాటు నైపుణ్యాలను పెంచాలని అధికారులకు సీఎం రేవంత్ సూచనలు చేశారు.
మరోవైపు కౌమార దశలోని యువత చెడు వ్యసనాలు, చెడు అలవాట్ల బారిన పడకుండా వారి జీవితాల్లో కొత్త వెలుగులు నింపేలా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పదో తరగతి ఉత్తీర్ణులైన ప్రతీ ఒక్క విద్యార్థి తప్పనిసరిగా ఇంటర్మీడియట్ పూర్తి చేయాలని సీఎం రేవంత్ ఇటీవల కీలక ప్రకటన చేశారు.
-
మార్కాపురం ప్రమాద ఘటన: చంద్రబాబు దృష్టికి ప్రమాద కారణం, సీఎం రేవంత్ దిగ్భ్రాంతి! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్..












Click it and Unblock the Notifications