సంక్రాంతి సంబరాలు 2026: తెలంగాణాలో మూడు భారీ ఫెస్టివల్స్ బొనాంజా!
సంక్రాంతి పండుగను ప్రపంచ స్థాయిలో ఘనంగా జరుపుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. తెలంగాణ టూరిజం ఆధ్వర్యంలో జనవరి 2026లో మూడు అంతర్జాతీయ స్థాయి మహోత్సవాలు నిర్వహించనుంది. రంగులు, రుచులు, సంప్రదాయాలు, ఆధునిక సాంకేతికతతో ఈ వేడుకలు తెలంగాణకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చేలా భారీగా ప్లాన్ చేసింది.
అంతర్జాతీయ కైట్స్ మరియు స్వీట్స్ ఫెస్టివల్ 2026
సంక్రాంతి పండుగకు అంతర్జాతీయ కైట్స్ మరియు స్వీట్స్ ఫెస్టివల్ 2026ను నిర్వహిస్తోంది. మకరసంక్రాంతి సందర్భంగా జనవరి 13వతేదీ నుంచి 15వతేదీ వరకు సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్ లో ఈ ఫెస్టివల్ జరగనుంది. ఈ వేడుకలో 19దేశాల నుంచి కైట్స్ కళాకారులు పాల్గొననున్నారు. ఇండోనేషియా, ఆస్ట్రేలియా, కెనడా, శ్రీలంక, జపాన్, ఫ్రాన్స్, ఇటలీ, స్విట్జర్లాండ్, రష్యా, ఉక్రెయిన్ వంటి దేశాల ప్రతినిధులు ఈ కైట్స్ ఫెస్టివల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నారు.

కైట్స్ ఫెస్టివల్ ప్రత్యేకతలు ఇవే
40 మంది అంతర్జాతీయ, 55 మంది జాతీయ కైట్స్ కళాకారులు పాల్గొనడం, భారతదేశంలోని 15 రాష్ట్రాల నుంచి కైట్స్ బృందాలు పాల్గొనడం, మూడు రోజులపాటు ప్రత్యేక నైట్ కైట్ ఫ్లయింగ్ నిర్వహించడం, తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించడం ఈ ఫెస్టివల్ ప్రత్యేకత. ఈ ఫెస్టివల్ లో వందకు పైగా హ్యాండ్లూమ్, మరియు హస్తకళల స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నారు.
అంతర్జాతీయ స్వీట్స్ ఫెస్టివల్
ఈ స్వీట్స్ ఫెస్టివల్లో 1200 కు పైగా రకాల స్వీట్లు సందర్శకులను ఆకట్టుకోనున్నాయి. భారతదేశ నలుమూలల నుంచి విదేశాలలో నివసిస్తున్న హైదరాబాదీ కుటుంబాలు తయారుచేసిన ఈ స్వీట్లు ఈ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.60 ఫుడ్ కోర్టులు తెలంగాణ వంటకాలు నుంచి అంతర్జాతీయ రుచుల వరకు అందరికీ ఇష్టమైన ఫుడ్స్ ను రుచి చూపించనున్నాయి.
హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ 2026
16వ తేదీ నుంచి జనవరి 18వ తేదీ వరకు ఈ ఫెస్టివల్ ను నిర్వహించనున్నారు. యూరప్ నుండి వచ్చిన 15 అంతర్జాతీయ ప్రమాణాల హాట్ ఎయిర్ బెలూన్ లు ఆకాశంలో విహరించ నున్నాయి. ఉదయం వేళ హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో బెలూన్ రైడ్స్, సాయంత్రం పెరేడ్ గ్రౌండ్స్ లో అద్భుతమైన నైట్ గ్లో బెలూన్ షో వీటిని చూడడానికి వచ్చిన కుటుంబాలకు పర్యాటకులకు మరిచిపోలేని తీపి అనుభూతిని మిగల్చనున్నాయి.
డ్రోన్ షో 2026
జనవరి 16, 17 తేదీలలో గచ్చిబౌలి స్టేడియంలో భారతదేశ వారసత్వం నుంచి అధునాతన సాంకేతికత వరకు చేసిన ప్రయాణాన్ని చూపించేలా ఈ డ్రోన్ షో రూపొందించబడింది. మల్టీకలర్ ఎల్ఈడి లైట్లతో హైటెక్ డ్రోన్లు, భారీ స్క్రీన్ లపై ఎఫ్ పీవీ డ్రోన్ రేసింగ్, డ్రోన్ సాకర్ మరియు అద్భుతమైన గగన విన్యాసాలు, డ్రోన్ల ద్వారా ప్రదర్శించబడే తెలంగాణ పర్యాటక ప్రాంతాలు ఈ డ్రోన్ షో ప్రత్యేకతలు.
ఇది కేవలం పండుగ కాదు, ఇది అద్భుతమైన అనుభవం
సంక్రాంతిని సాంప్రదాయాల సాంకేతిక మేళవింపుగా అత్యద్భుతంగా జరుపుకునేందుకు తెలంగాణ ప్రపంచాన్ని ఆహ్వానిస్తోంది. TELANGANA FESTIVE EXTRAVAGANZA 2026 - ఇది కేవలం పండుగ కాదు, ఇది ఒక అద్భుతమైన అనుభవం అని చెబుతోంది.
-
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..!












Click it and Unblock the Notifications