తెలంగాణలో సౌదీ సిద్ధం
హైదరాబాద్: తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు సౌదీ అరేబియా ముందుకొచ్చింది. రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు అద్భుతంగా జరుగుతున్నాయని భారత్ లో సౌదీ రాయబారి డాక్టర్ సౌద్ మహమ్మద్ అల్సతి ప్రశంసించారు. విద్య, వైద్యం తదితర రంగాలతోపాటు సంక్షేమ కార్యక్రమాల్లో తెలంగాణ దూసుకుపోతున్నదని కొనియాడారు. ముఖ్యంగా మైనార్టీల విషయంలో తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నదని అభినందించారు. సౌదీ ప్రభుత్వ సాంస్కృతిక, సామాజిక, ఆర్థిక వ్యవహారాల ప్రతినిధులతో కలిసి డిప్యూటీ సీఎం మహమూద్ అలీ ఆధ్వర్యంలో సౌదీ రాయబారి.. సీఎం కేసీఆర్‌ను హైదరాబాద్‌లోని అధికార నివాసంలో కలిశారు.












Click it and Unblock the Notifications