అడిగినందుకే..: తెలంగాణ టిడిపి బహిరంగ లేఖ
హైదరాబాద్: తెలంగాణ తెలుగుదేశం పార్టీ ప్రజలకు బహిరంగ లేఖ రాసింది. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఉగాది పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కేంద్రమంత్రి సుజనా చౌదరి, టీటీడీపీ నేత ఎల్.రమణ హాజరయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలకు టీడీపీ శాసనసభాపక్షం బహిరంగ లేఖ రాసింది.
ప్రజలకు న్యాయం చేయాలని అడిగినందుకు టీడీపీ సభ్యులను సస్పెండ్ చేశారని తెలంగాణ టిడిపి నాయకులు ఆ లేఖలో విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజా సమస్యలు చర్చకు రాకుండా చేసుకోవచ్చని ప్రభుత్వం భావించిందని టీడీపీ నేతలు తెలిపారు. జాతీయగీతం అప్పుడు సభలో ప్రకటన చేయలేదన్నారు.

తెలుగుదేశం పార్టీ సభ్యులపై దాడిని కప్పిపుచుతున్నారని మండిపడ్డారు. సస్పెన్షన్‌పై తప్పని విపక్షాలు చెప్పినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని లేఖలో అన్నారు. తాము చెప్పిందే వేదం, చేసిందే శాసనం అన్నట్లు టీఆర్‌ఎస్ తీరు ఉందని వ్యాఖ్యానించారు.
టీఆర్‌ఎస్‌కు ప్రజాస్వామ్య వ్యవస్థలు, ప్రతికాస్వేచ్ఛ అక్కర్లేదు, ప్రతిపక్షాలు ఉండకూడదన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ప్రజల మద్దతు కావాలని కోరారు. ఎందరో త్యాగాలతో తెలంగాణ ఏర్పడిందని, నిరంకుశులు ఏలితే అంతిమంగా ప్రజలకే నష్టమని టీడీఎల్పీ నేతలు లేఖలో పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications