తెలంగాణలో తొలి రబ్బర్ డ్యామ్.. ఆ జిల్లాలోనే.. రూ. 520 కోట్లతో నిర్మాణం
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోనే తొలిసారిగా మంజీరా నదిపై రబ్బర్ డ్యామ్ ను నిర్మించనుంది. రూ. 520 కోట్లతో నిర్మాణం చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం మల్లూరు గ్రామ శివారులో ఈ రబ్బర్ డ్యామ్ ను నిర్మించేందుకు సిద్ధం అయింది. ఈ డ్యామ్ ను నిజాంసాగర్ ఆనకట్టకు దాదాపు 7 కిలోమీటర్ల దిగువన నిర్మించనున్నారు. నిజాంసాగర్ ఆనకట్ట దిగువన దాదాపు ఏడు కిలోమీటర్ల వద్ద నదిపై డ్యామ్ ను నిర్మించాలని ప్రతిపాదించారు.
తెలంగాణలోని కామారెడ్డి జిల్లా రైతులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. జిల్లాలో దాదాపు 40 వేల ఎకరాలకు నీళ్లు అందించే విధంగా కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోనే తొలిసారిగా మంజీరా నదిపై రబ్బర్ డ్యామ్ నిర్మించేందుకు సిద్ధమైంది. ఈ డ్యామ్ నిర్మాణానికి రూ. 520 కోట్లు ఖర్చు చేయనుంది. కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం మల్లూరు గ్రామ శివారులో ఈ రబ్బర్ డ్యామ్ ను నిర్మించేందుకు సిద్ధం అయింది.
అలాగే రబ్బర్ డ్యామ్ నిర్మాణంతో పాటు నిర్మించనున్న ఎత్తిపోతల పథకం ద్వారా ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించనుంది. డ్యామ్ నుంచి 3.50 టీఎంసీల నీటిని పంపింగ్ చేసేలా అధికారులు ప్రణాళికలు రూపకల్పన చేశారు. హైదరాబాద్ లోని జలసౌధ కార్యాలయంలో శుక్రవారం జరిగిన రాష్ట్ర స్థాయి స్టాండింగ్ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 13 పనులకు సంబంధించిన ప్రతిపాదనలు రాగా వాటిలో రబ్బర్ డ్యామ్ ప్రతిపాదన కూడా ఉంది.

రబ్బర్ డ్యామ్ ను ఎలా నిర్మిస్తారంటే.. ఈ ఆనకట్టను రబ్బరు మెమ్బ్రేన్ తో నిర్మిస్తారు. ఇది నీటి స్థాయిని నియంత్రించడానికి ఉపయోగించబడుతుంది. గాలితో నింపిన ఫ్లెక్సిబుల్ మెంబ్రేన్ డ్యామ్ లు, రబ్బర్ డ్యామ్ లు నీటిని ఆపడానికి, నియంత్రించడానికి ఉపయోగిస్తారు. ఇది నీటి స్థాయిని పెంచుతుంది. రబ్బర్ డ్యామ్ లను నీటిపారుదల, నీటి సరఫరా, వరదలు నియంత్రణ వంటి ప్రయోజనాల కోసం ఉపయోగిస్తారు. ఈ డ్యామ్ ను సాధారణంగా స్టెయిన్ లెస్ స్టీల్ లేదా సిరామిక్ చిప్ లతో బలోపేతం చేస్తారు. బీహార్ లోని ఫల్గూ నదిపై గయాజీ డ్యామ్ దేశంలోనే అతి పొడవైన రబ్బర్ డ్యామ్ కు ఉదాహరణగా నిలుస్తోంది. ఇది పర్యావరణ అనుకూలమైనది. ఈ డ్యామ్ లో కాంక్రీట్ కు బదులుగా రబ్బర్ ను ఉపయోగించారు.












Click it and Unblock the Notifications