తెలంగాణా యూనివర్సిటీలలో భారీ ఉద్యోగాల భర్తీ త్వరలోనే.. లేటెస్ట్ అప్డేట్!

రాష్ట్ర విశ్వవిద్యాలయాల్లో బోధనా సిబ్బంది ఖాళీలు భర్తీ చేసే విషయంలో ప్రభుత్వం మరింత విస్తృతంగా ఆలోచిస్తోంది. ఇప్పటికే 429 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులను కూడా అదే నోటిఫికేషన్‌లో చేర్చాలని ఆలోచనలు సాగుతున్నాయి. విశ్వవిద్యాలయాల్లో అసోసియేట్ ప్రొఫెసర్ ఖాళీలు 1,310 వరకు ఉన్నాయని, వాటిని కూడా భర్తీ చేస్తే వర్సిటీలు బలోపేతం అవుతాయని వైస్ ఛాన్సలర్లు అభిప్రాయపడుతున్నారు.

విద్యాశాఖపై జరిగిన తాజా సమీక్షలో ఈ విషయం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దృష్టికి వచ్చింది. కేవలం 429 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులతో పెద్దగా మార్పు రాదని, అసోసియేట్ ప్రొఫెసర్ ఖాళీలను కూడా భర్తీ చేయాలని కొందరు అధికారులు, వీసీలు సూచించారు. దీనిపై వీసీలు, ఉన్నత విద్యామండలి అధికారులు కలిసి చర్చించి నిర్ణయం తీసుకోవాలని సీఎం సూచించారు.ప్రస్తుతం వర్సిటీల్లో పనిచేస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్లు చాలామంది కెరీర్ అడ్వాన్స్‌మెంట్ స్కీమ్ ద్వారా ఇప్పటికే అసోసియేట్ ప్రొఫెసర్‌లుగా పదోన్నతి పొందారు.

Telangana universities Govt Eyes Filling Associate Professor Posts Along with 429 Assistant Professor Vacancies

అందువల్ల కొత్తగా అసోసియేట్ పోస్టులకు దరఖాస్తు చేసేవారు ఎక్కువగా ప్రైవేట్ కళాశాలల్లో పనిచేస్తున్నవారే ఉంటారని అభిప్రాయం వ్యక్తమైంది. దీనివల్ల మెరిట్ అభ్యర్థులు రాకపోవచ్చని ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో కొన్ని అసోసియేట్ పోస్టులను అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులుగా మార్చి నోటిఫికేషన్ జారీ చేస్తే ప్రతిభావంతులైన అభ్యర్థులు వస్తారని వీసీల్లో చర్చ సాగుతోంది. అయితే ఇలా మార్పులు చేస్తే న్యాయపరమైన సమస్యలు తలెత్తకుండా చూడాలని అధికారులు భావిస్తున్నారు. అందుకోసం న్యాయ నిపుణుల సలహా తీసుకోవాలని నిర్ణయించారు.

ఉన్నతస్థాయి సమావేశం ఏర్పాటు చేసి, త్వరలో వెలువడబోయే నోటిఫికేషన్‌లో అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులను చేర్చడం సాధ్యమైతే చేర్చాలని చర్చిస్తామని విద్యాశాఖ వర్గాలు తెలిపాయి. రాష్ట్ర విశ్వవిద్యాలయాల్లో బోధనా సిబ్బంది ఖాళీలు చాలా కాలంగా ఉన్నాయి. మొత్తం టీచింగ్ పోస్టుల్లో వేల సంఖ్యలో ఖాళీలు ఉన్నాయని గణాంకాలు చెబుతున్నాయి. కేవలం అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు భర్తీ చేయడం వల్ల ఒక మేరకు ఉపశమనం లభించినా, అసోసియేట్, ప్రొఫెసర్ స్థాయి ఖాళీలు కొనసాగితే విద్యా ప్రమాణాలు ప్రభావితం కావచ్చు.

రాహుల్ గాంధీ గురించి మాట్లాడే ఇమేజ్ మీకుందా? : మంత్రి పొన్నం ప్రభాకర్ కేటీఆర్‌కు కౌంటర్
రాహుల్ గాంధీ గురించి మాట్లాడే ఇమేజ్ మీకుందా? : మంత్రి పొన్నం ప్రభాకర్ కేటీఆర్‌కు కౌంటర్

విద్యార్థులకు నాణ్యమైన బోధన అందించాలంటే అన్ని స్థాయిల్లోనూ అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు అవసరం.ఈ నేపథ్యంలో ప్రభుత్వం విస్తృతంగా ఆలోచించి, వీలైనంత ఎక్కువ పోస్టులు భర్తీ చేసే దిశగా అడుగులు వేస్తే విశ్వవిద్యాలయాలు బలపడతాయని విద్యా రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. నోటిఫికేషన్ వివరాలు త్వరలో ఖరారవనున్నాయి. అభ్యర్థులు, విద్యా సంఘాలు ఈ పరిణామాలను ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+