హైదరాబాద్‌కు తాగునీటి కోసం కూడా: నీటిపై ఏపీకి తెలంగాణ లేఖ
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తెలంగాణ నీటి పారుదల శాఖ గురువారం నాడు లేఖ రాసింది. పాలమూరు ఎత్తిపోతల పథకం, డిండి ప్రాజెక్టుల పైన లేఖ రాసింది. పాలమూరు ఎత్తిపోతల పథకం విషయంలో తాము ఎలాంటి నిబంధనలు ఉల్లంఘించలేదని పేర్కొంది.
2013లోనే పాలమూరు ఎత్తిపోతల పథకానికి అనుమతులు వచ్చాయని లేఖలో వెల్లడించారు. పాలమూరు ఎత్తిపోతల పథకం కొత్త ప్రాజెక్టు అని, నిబంధనలకు విరుద్ధంగా ఉందంటూ ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కేంద్ర జల వనరుల సంఘానికి లేఖ రాయడంపై తెలంగాణ నీటి పారుదల శాఖ లేఖ రాసింది.

పాలమూరు ఎత్తిపోతల పథకం ఎక్కడా నిబంధలకు విరుద్ధంగా లేదన్నారు. నిబంధనలకు విరుద్ధంగా తాము ఎక్కడా ప్రాజెక్టులు నిర్మించలేదని పేర్కొన్నారు. న్యాయబద్ధంగానే వాడుకుంటున్నామని చెప్పారు. కృష్ణా బేసిన్లో ఉన్న పాలమూరు జిల్లా సాగునీరు లేకుండా ఇబ్బంది పడుతోందని పేర్కొంది.
నల్గొండ జిల్లాలో ఫ్లోరోసిస్ నుండి విముక్తి కోసం డిండి ప్రాజెక్టు చేపడుతున్నామని చెప్పారు. కృష్ణా బోర్డు కేటాయించిన నీటినే తాము వాడుకుంటామని చెప్పారు. పాలమూరు ఎత్తిపోతలతో పదిలక్షల ఎకరాలకు సాగునీరు, హైదరాబాదుకు తాగునీరు వస్తుందని ఏపీ ఇరిగేషన్ కార్యదర్శికి తెలంగాణ ఇరిగేషన్ కార్యదర్శి లేఖలో పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications