తెలుగు కుబేరులు- సంఖ్య..సంపద పెరుగుతోంది : తొలి పది స్థానాల్లో నిలిచింది వీరే..!!

తెలుగు రాష్ట్రాల్లో కుబేరుల సంఖ్య పెరుగుతోంది. వెయ్యి కోట్లు కంటే ఎక్కువ సంపద ఉన్న వారిలో గతం ఏడాది 9 మంది ఉండగా..ఇప్పుడు అది 15కు చేరింది. తాజాగా ఐఐఎఫ్‌ఎల్‌ వెల్త్‌ హురూన్‌ ఇండియా సంపన్నుల జాబితా-2021 వెల్లడించింది. అందులో స్థానం సంపాదించిన వారి సంపద గత ఏడాదిలో పోలిస్తే 54 శాతం మేర పెరిగింది. ఇందులో 56 మంది హైదరాబాద్ నుంచి ఉండగా.. నలుగురు రంగారెడ్డి నుంచి ఉన్నారు. కాగా, విశాఖకు చెందిన వారు ముగ్గురు ఉన్నారు. సెప్టెంబర్‌ 15 నాటికి బిలియన్‌ డాలర్లకుపైగా సంపద కలిగిన వారి సంఖ్య ఏడాదిలో 9 నుంచి 15కు చేరింది.

రూ.79,000 కోట్లతో దివీస్‌ ల్యాబొరేటరీస్‌ వ్యవస్థాపకులు మురళి దివి, ఆయన కుటుంబం తొలి స్థానంలో నిలిచింది. పదేళ్ల క్రితం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ నుంచి ఐఐఎఫ్‌ఎల్‌ వెల్త్‌ హురూన్‌ లిస్ట్‌లో ముగ్గురు మాత్రమే నమోదయ్యారు. తాజా జాబితాలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ నుంచి 69 మంది చోటు సంపాదించారు. వీరందరి సంపాదన రూ.3,79,200 కోట్లు. గతేడాదితో పోలిస్తే ఇది 54 శాతం వృద్ధి. కొత్తగా 13 మంది ఈ లిస్ట్‌లో చేరారు. మొత్తం జాబితాలో ఇద్దరు మహిళలు ఉన్నారు.

Telugu richest persons in IIFL wealth huren india billioneers list -2021 list

అయితే ఔషధ తయారీ రంగం నుంచే 21 మంది ఉండడం విశేషం. రూ.1,000 కోట్లు, ఆపైన సంపద కలిగిన వ్యక్తులతో ఈ జాబితాను రూపొందించారు. ఈ ఏడాది జాబితాలో కొత్తగా పేరు దక్కించుకున్న వారిలో మొదటి అయిదు స్థానాల్లో జి.అమరేందర్‌రెడ్డి, కుటుంబం, వెంకటేశ్వర్లు జాస్తి, కుటుంబం, ఏ.ప్రతాప్‌ రెడ్డి (బాలాజీ అమైన్స్‌), దాసరి ఉదయ్‌కుమార్‌ రెడ్డి (తాన్లా ప్లాట్‌ఫామ్స్‌), అనిల్‌ కుమార్‌ చలమలశెట్టి (గ్రీన్‌కో), మహేశ్‌ కొల్లి(గ్రీన్‌కో) ఉన్నారు. ఇక, దివీస లేబొరేటరీస్ అధినేత మురళీ దివి సంపద 79 వేల కోట్లుగా ఉంది.

హెటిరో ల్యాబ్స్ పార్ధసారధి రెడ్డి సంపద 26,100 కోట్లుగా నమోదైంది. మెఘా ఇంజనీరింగ్ పీ పిచ్చిరెడ్డి..పీవీ క్రిష్ణారెడ్డి సంపద 23,400 కోట్లుగా ఉంది. డాక్టర్ రెడ్డీస్ కు చెందిన సతీష్ రెడ్డి సంపద 12,300 కోట్లు. అదే విధంగా జీఏఆర్ అమరేందర్ రెడ్డి 12,000 కోట్ల సంపదగా గుర్తించారు. ఎంఎస్ఎన్ లేబొరేటరీస్ అధినేత ఎం సత్యనారాయణ రెడ్డి సంపద 11,500 కోట్లు కాగా, డాక్టర్ రెడ్డీస్ జీవి ప్రసాద్ సంపద 10,300 కోట్లుగా గుర్తించారు.

సువెన్ ఫార్మా జాస్తి వేంకటేశ్వర్లు 9,700 కోట్లు , గ్లాండ్ ఫార్మా పీవీఎన్ రాజు 9,300 కోట్లు, నాట్కో ఫార్మా వీసీ నన్నపనేని సంపద 9,100 కోట్లుగా ఉంది. తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చే అయిదేళ్లలో దాదాపు 200 మంది ఐఐఎఫ్‌ఎల్‌ వెల్త్‌ హురూన్‌ ఇండియా సంపన్నుల జాబితా లో చేరుతారని అంచనా వేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+