'బీసీల నుండి టీడీపీని దూరం చేయలేరు'
హైదరాబాద్: బీసీలను తెలుగుదేశం పార్టీ నుండి ఎవరు దూరం చేయలేరని తెలుగుదేశం పార్టీ నేత ప్రతాప్ రెడ్డి సోమవారం అన్నారు. యాదవులను, బీసీలను రాజకీయంగా పైకి తీసుకు వచ్చింది తెలుగుదేశం పార్టీయేనని చెప్పారు.
తెలంగాణ రాష్ట్ర సమితి చిల్లర రాజకీయాలు చేస్తోందని ధ్వజమెత్తారు. సిద్దిపేటలో యాదవ కమ్యూనిటీ హాల్ కోసం టీడీపీ స్థలం కేటాయించినా ఇప్పటి వరకు భవనం కట్టలేదన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితికి దమ్ముంటే ఫిరాయించిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు సిద్ధం కావాలని డిమాండ్ చేశారు.

కాగా, మూడు రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అదినేత నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ... టీడీపీ లేకుంటే తెలంగాణ సీఎం కేసీఆర్ సిద్దిపేటలో పశువులు కాసేవారని వ్యాఖ్యానించారు. దీని పైన తెలంగాణ రాష్ట్ర సమితి, కొందరు యాదవులు మండిపడ్డారు.
మరోవైపు, తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఎల్బీ నగర్ నియోజకవర్గం నుంచి శాసనసభకు ఎన్నికైన ఆర్ కృష్ణయ్య ఆ పార్టీకి దూరమై, కొత్త పార్టీ పెడతారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. బీసీల కోసం పార్టీ పెట్టవచ్చునని అంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రతాప్ రెడ్డి స్పందించారు.
-
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా












Click it and Unblock the Notifications