Telangana: డేంజర్ జోన్ లో తెలంగాణ.. 46 డిగ్రీలకు చేరిన ఉష్ణోగ్రతలు..!
రాష్ట్రంలో ఎండలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. పలు ప్రాంతాల్లో భారీగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉత్తర తెలంగాణ ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాలోని పలు ప్రాంతాల్లో 46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. దీంతో జనం బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. తెలంగాణలో ఎండల తీవ్ర కొనసాగుతోందని ఐఎండీ తెలిపింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో
వడగాలులు వీస్తాయని ప్రకటించింది.
వడగాలుల నేపథ్యంలో ప్రజలు ముఖ్యంగా మధ్యాహ్నం 12:00 నుంచి 3:00 గంటల మధ్య ఎండలో బయటికి రాకుండా ఉండాలని తెలంగాణ ఆరోగ్య శాఖ ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది. ఆల్కహాల్, టీ, కాఫీ, కార్బోనేటేడ్ శీతల పానీయాలు, పెద్ద మొత్తంలో చక్కెరతో కూడిన పానీయాలకు దూరంగా ఉండాలని డిపార్ట్‌మెంట్ ప్రజలను కోరింది. ఎందుకంటే అవి ఎక్కువ శరీర ద్రవాలను కోల్పోవటానికి లేదా కడుపు తిమ్మిరికి కారణం కావచ్చు.

శిశువులు, చిన్నపిల్లలు, ఆరుబయట పనిచేసే వ్యక్తులు, గర్భిణీ స్త్రీలు, మానసిక వ్యాధులు లేదా శారీరకంగా అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తులు, ముఖ్యంగా గుండె జబ్బులు లేదా అధిక రక్తపోటు ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. వడ దెబ్బ తగలకుండా చూసుకోవాలని చెబుతున్నారు.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో మే 5 వరకు వడగాలులు వీచే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. మే 2న ఈశాన్య రాష్ట్రలైన నాగలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపురలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
Heat wave conditions likely in isolated pockets of Gangetic West Bengal, Jharkhand, Odisha, Madhya Maharashtra, Marathwada, Saurashtra, Gujarat region, Rayalaseema, Telangana and North Interior Karnataka on 05th May, 2024. pic.twitter.com/JgDhKPcE0k
— India Meteorological Department (@Indiametdept) May 1, 2024
-
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్












Click it and Unblock the Notifications