Karthika Masam: భక్తులతో కిటకిటలాడుతోన్న ఆలయాలు..

తెలుగు రాష్ట్రాల్లో ఆలయాలు భక్తులతో నిండిపోయాయి. కార్తీకమాసం చివరి సోమవారం సందర్భంగా శైవక్షేత్రాల్లో భక్తుల రద్దీ కనిపిస్తోంది. ముఖ్యంగా శివాలయాలకు భక్తులు భారీగా తరలొచ్చారు. వేములవాడ రాజరాజేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీశైలంతో పాటు ప్రధానాలయాలకు తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో చేరుకుని ప్రత్యేక పూజలు చేస్తున్నారు.

శ్రీశైలం ఘాట్ రోడ్డులో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. రోడ్లపై పెద్దఎత్తున నిలిచిన వాహనాలను పోలీసులు క్లియర్ చేస్తున్నారు.శ్రీశైలం నుండి హాటకేశ్వరం వరకు భారీగా వాహనాలు నిలిచిపోయాయి. సుమారు 4 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కార్తీక చివరి సోమవారం కావడంతో శ్రీశైలం ఆలయానికి పెద్దఎత్తున భక్తులు తరలివస్తున్నారు.

 Temples in Telugu states have become crowded with devotees

కృష్ణా, గోదావరి నదుల్లో పుణ్యస్నానాలు అచరిస్తున్నారు. అటు విజయవాడలోని దుర్గమ్మ గుడికి భారీగా భక్తులు వచ్చారు. విజయవాడలోని దుర్గా ఘాట్‌ వద్ద రద్దీ నెలకొంది. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దంపతులుదుర్గమ్మను దర్శించుకున్నారు. అమ్మవారికి సారే ను సమర్పించారు. వారికి వేద పండితులు ఆశీర్వచనం ఇచ్చి ప్రసాదం అందజేశారు.

పొంగులేటి దంపతులను వైఎస్ఆర్సిపి ఎంపీ మిధున రెడ్డి, కాపు కార్పొరేషన్ చైర్మన్ శేషు,, కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షుడు రుద్దరాజు, ఏపీ కాంగ్రెస్ నేతలు రిసీవ్ చేసుకున్నారు. రాజమహేంద్రవరం, భద్రాచలంలో గోదావరి నదిలో భక్తులు పుణ్యస్నానాలు చేశారు. దీపాలను వెలిగించి నదుల్లో వదిలారు. అటు తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+