సానియా మీర్జాకు ప్రధాని మోదీ రెండు పేజీల లెటర్..

ఇటీవలే రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జాకు ప్రధాని నరేంద్ర మోదీ లేఖ రాశారు. దేశ ప్రతిష్ఠను పెంచేలా చేశారని ప్రశంసించారు. దీనికి ఆమె బదులిచ్చారు.

హైదరాబాద్: హైదరాబాద్ కు చెందిన స్టార్ టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా.. ఇటీవలే తన కేరీర్ కు గుడ్ బై చెప్పారు. టెన్నిస్ నుంచి వీడ్కోలు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. చిట్టచివరి మ్యాచ్ కూడా ఆడేశారు. లైఫ్ అప్ డేట్ అంటూ జనవరి 13వ తేదీన ఓ లెటర్ ను ఆమె తన అధికారిక ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేశారు. తన కేరీర్ లోని ముఖ్య ఘట్టాలన్నింటినీ అందులో పొందుపర్చారు. టెన్నిస్ కు వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించారు.

కిందటి నెలలో చివరి టోర్నీ ఆడారు. ఓటమితో ముగించారు. దుబాయ్ ఓపెన్ డబ్ల్యూటీఏలో డబుల్స్ లో అమెరికాకి చెందిన మాడిసన్ కీస్‌ తో కలిసి ఆడిన ఈ మ్యాచ్‌ లో సానియా మీర్జా పరాజయాన్ని చవి చూశారు. ఈ టోర్నమెంట్ లో ఫస్ట్ రౌండ్‌ని కూడా దాటలేకపోయారు. రష్యాకు చెందిన వెర్నోకియా-సంసొనోవా చేతిలో 4-6, 0-6 తేడా ఓడిపోయారు. 36 సంవత్సరాల వయసులో ఆమె కేరీర్ కు గుడ్ బై చెప్పారు.

Tennis Star Sania Mirza thanked PM Modi and says that I have always taken great pride

ఈ సందర్భంగా సానియా మీర్జాను అభినందిస్తూ ఈ నెల 9వ తేదీన ప్రధాని మోదీ ఆమెకు రెండు పేజీల లేఖ రాశారు. లైఫ్ అప్ డేట్ అంటూ జనవరి 13వ తేదీన పెట్టిన పోస్ట్ తనను కదిలించిందని పేర్కొన్నారు. విమెన్స్ డబుల్స్, మిక్స్డ్ డబుల్స్ లల్లో గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్లల్లో సాధించిన విజయాలు.. యువ క్రీడాకారులకు స్ఫూర్తినిచ్చాయని కితాబిచ్చారు. ఆరు సంవత్సరాల వయస్సు నుంచే టెన్నిస్ పట్ల ఆసక్తి చూపడం అసాధారణమని పేర్కొన్నారు.

ఈ లెటర్ ను సానియా మీర్జా ఇవ్వాళ తన అధికారిక ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేశారు. తనను అభినందిస్తూ లేఖ రాసిన ప్రధాని మోదీకి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. మోదీ తనకు లేఖ రాయడాన్ని చిరస్మరణీయంగా భావిస్తానని వ్యాఖ్యానించారు. మన దేశానికి ప్రాతినిథ్యాన్ని వహించడం తనకు ఎప్పుడూ గర్వకారణమేనని పేర్కొన్నారు. దేశం గర్వించేలా క్రీడారంగం అభివృద్ధి కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తానని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+