telangana elections: ఎన్నికల వేళ ఆ ప్రచారంతో బీఆర్ఎస్ లో టెన్షన్!!
తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఎన్నికల షెడ్యూల్ రానే వచ్చింది. నేటి నుంచి ఎన్నికల కోడ్ రాష్ట్రవ్యాప్తంగా అమలులోకి రానుంది. నవంబర్ 30వ తేదీన తెలంగాణ శాసనసభ ఎన్నికలు జరగనుండగా డిసెంబర్ మూడవ తేదీన ఫలితాలు వెలువడనున్నాయి. అయితే ప్రస్తుతం ఎన్నికల హడావిడి కొనసాగుతున్న తెలంగాణలో అధికార బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణలో ప్రస్తుతం జరుగుతున్న ఒక ప్రచారం తలనొప్పిగా తయారైంది.
గత తొమ్మిది సంవత్సరాలుగా మంత్రులుగా ఉన్న వారు, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు చరిష్మా తగ్గిందని వచ్చే ఎన్నికలలో ఊహించని విధంగా కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటుందని, కాంగ్రెస్ అధికారాన్ని హస్తగతం చేసుకుంటుందని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. మంత్రులు, ఎమ్మెల్యేలుగా సుదీర్ఘంగా పనిచేసిన వాళ్లకు జనాలలో పట్టులేదని, ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో గ్రాఫ్ పెరుగుతుందని కూడా ప్రచారం జరుగుతుంది.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని మౌత్ పబ్లిసిటీ బాగా జరుగుతున్న వేళ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు టెన్షన్ పడుతున్నారు.ఇటీవల కాలంలో రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు తమ తమ నియోజకవర్గాలలో పలు అభివృద్ధి కార్యక్రమాలను యుద్ధ ప్రాతిపదికన కొనసాగించారు. ప్రజాక్షేత్రంలోకి వెళుతూ ఓటర్ల మనసును గెలుచుకునే ప్రయత్నం చేశారు. సభలు, సమావేశాలు నిర్వహిస్తూ హడావిడి చేశారు.
అయినప్పటికీ బి ఆర్ ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులకు ఈ ఎన్నికల్లో తమను విజయం వరిస్తుందో లేదా అన్నది మాత్రం ఆందోళన కలిగిస్తుంది. జనాలలో గత తొమ్మిదేళ్లుగా బీఆర్ఎస్ పాలకులను చూసి చూసి నైరాశ్యం వచ్చిందని, ప్రజాక్షేత్రంలో వ్యతిరేకతను మూటగట్టుకున్న ఎమ్మెల్యేలు, మంత్రులను ఈసారి మళ్లీ గెలిపించరని అనేక చోట్ల ప్రచారం జోరుగానే సాగుతుంది.
ఈసారి సీఎం కేసీఆర్ కొన్ని స్థానాలు మినహాయించి మిగతా అన్నిచోట్ల సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు ఇచ్చి ప్రజాక్షేత్రంలో దూకుడుగా ముందుకు వెళ్లాలని, మళ్లీ గులాబీ జెండాను ఎగురవేయాలని దిశా నిర్దేశం చేశారు. స్థానికంగా ఉన్న సమస్యలను తెలుసుకుని, ఆ సమస్యలను పరిష్కరిస్తూ ప్రజలకు మరింత చేరువ కావాలని సూచించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులు ఆ ప్రయత్నం చేస్తున్నప్పటికీ వారిలో మాత్రం ప్రస్తుతం టెన్షన్ కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. కాంగ్రెస్ గురించి ప్రస్తుతం జరుగుతున్న ప్రచారంతో గులాబీ నేతల్లో గుబులు కనిపిస్తుంది.
-
Jeevan Reddy: జీవన్ రెడ్డి రాజీనామాకు ముహుర్తం ఫిక్స్-కార్యకర్తలకు లేఖ-ఏ పార్టీలోకి ? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!!












Click it and Unblock the Notifications