నిమజ్జనం వేళ.. ట్యాంక్‌బండ్‌పై ఆందోళన- ఉద్రిక్తత
హైదరాబాద్: హైదరాబాద్‌లోని హుస్సేన్ సాగర్‌లో వినాయక విగ్రహాల నిమజ్జనం వేళ.. ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌తో తయారు చేసిన గణేష్ విగ్రహాలను హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం చేయడాన్ని పోలీసులు అడ్డుకోవడం దీనికి కారణమైంది. హైకోర్టు ఆదేశాల మేరకు నిమజ్జనాన్ని నిషేధించడంతో మండపాల నిర్వాహకులు ఆందోళనకు దిగారు. ట్యాంక్‌బండ్‌పై బైఠాయించారు.
పర్యావరణాన్ని పరిరక్షించడం, కాలుష్యాన్ని నివారించడంలో భాగంగా హుస్సేన్ సాగర్‌తో పాటు ఇతర చెరువుల్లో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌తో తయారు చేసిన గణేషుడి విగ్రహాలను నిమజ్జనం చేయడాన్ని పూర్తిగా నిషేధిస్తూ తెలంగాణ హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ట్యాంక్ బండ్‌పై పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు.

నిమజ్జనం కోసం ట్రాక్టర్లు, భారీ ట్రక్కులు, ఇతర వాహనాల మీద తీసుకొచ్చిన విగ్రహాలను నిమజ్జనం చేయకుండా అడ్డుకున్నారు. హైకోర్టు ఆదేశాలను తాము పాటించాల్సి ఉంటుందని, హుస్సేన్ సాగర్‌లో వాటిని నిమజ్జనం చేయొద్దంటూ మండపాల నిర్వాహకులకు విజ్ఞప్తి చేశారు. వెనక్కి వెళ్లాలంటూ సూచించారు.
నిమజ్జనాన్ని పోలీసులు అడ్డుకోవడంతో మండపాల నిర్వాహకులు ఆందోళనకు దిగారు. ట్యాంక్‌బండ్‌పై బైఠాయించారు. వాహనాల రాకపోకలను స్తంభింపజేశారు. పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. హుస్సేన్ సాగర్‌లో వినాయకుడి విగ్రహాలను నిమజ్జనం చేయడం ఆనవాయితీగా వస్తోందని, నిమజ్జనం వేళ.. ఇలాంటి ఉత్తర్వులు జారీ చేయడం సరికాదని అన్నారు. వుయ్ వాంట్ జస్టిస్ అంటూ నినదించారు.

పెద్ద సంఖ్యలో వినాయక మండపాల నిర్వాహకులు ట్యాంక్‌బండ్‌పై బైఠాయించడంతో ఈ మార్గంలో తిరిగే వాహనాల రాకపోకలు ఎక్కడికక్కడ స్తంభించిపోయాయి. సిటీ బస్సులు, ద్విచక్ర వాహనాలు, ఇతర ప్రైవేటు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. రెండు కిలోమీటర్లకు పైగా వాహనాలు ఎక్కడికక్కడే స్తంభించాయి.












Click it and Unblock the Notifications