ఉద్యోగుల కోసం ప్రభుత్వం అదిరిపోయే నిర్ణయం- ప్రతీ కుటుంబానికి రూ 1.50 కోట్లు..!!
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంటోంది. ఉద్యోగులకు మేలు చేసే నిర్ణయానికి ఆమోద ముద్ర వేస్తోంది. ఉద్యోగుల కుటుంబాలకు భరోసా కల్పించే నిర్ణయం ప్రకటన కు సిద్దం అయింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రమాద బీమా సదుపాయానికి అడుగులు పడుతున్నాయి. ప్రతీ ప్రభుత్వ ఉద్యోగికి రికార్డు స్థాయిలో రూ.1.25 కోట్ల నుంచి రూ.1.50 కోట్ల వరకు ప్రమాద జీమా పథకం అమలు చేయాలని భావిస్తోంది. ఈ మేరకు అధికారిక నిర్ణయం పైన కసరత్తు కొనసాగుతోంది.
ప్రభుత్వ ఉద్యోగులు ప్రతీ ఒక్కరికీ భీమా కల్పించే అంశం పైన తెలంగాణ ప్రభుత్వం కసరత్తు వేగవంతం చేసింది. ఈ మేరకు రాష్ట్ర ఆర్థికశాఖ వివిధ బ్యాంకుల యాజమాన్యాలతో అంతర్గత చర్చలు జరుపుతోంది. బ్యాంకులో శాలరీ ఎకౌంట్ ఉన్న ప్రభుత్వోద్యోగులు అందరికీ దేశంలోనే అత్యుత్తమ స్థాయిలో ప్రమాద, ఆరోగ్య బీమా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే సింగరేణి ఉద్యోగులు, కార్మికులు ఏదైనా ప్రమాదంలో మరణిస్తే బాధిత కుటుంబానికి రూ.కోటి బీమా ఇచ్చేలా సంస్థ పలు బ్యాంకులతో ఒప్పందాలు చేసుకుంది. శాలరీ ఎకౌంట్ ఉన్న ప్రతి కార్మికునికి రూ.కోటి ప్రమాద బీమా పథకాన్ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) సహా పలు బ్యాంకులు అమలు చేస్తున్నాయి. ఇప్పటికే శాలరీ ఎకౌంట్ ఉన్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బ్యాంకులు పలు సదుపాయాలు కల్పిస్తున్నాయి.

ఇదే తరహాలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సదుపాయం కల్పించేలా తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. శాలరీ ఎకౌంట్ ఉన్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి ఏదైనా ప్రమాదంలో మరణిస్తే కుటుంబానికి బ్యాంకు రూ.కోటి బీమా చెల్లిస్తోంది. విమాన ప్రమాదంలో మరణిస్తే రూ.1.60 కోట్లు, రూపే డెబిట్ కార్డు ఉంటే మరో రూ.కోటి ఇస్తోంది. అదే విధంగా శాశ్వత వైకల్యం సంభవిస్తే రూ.కోటి, సహజ మరణం అయితే రూ.10 లక్షలు అందజేస్తోంది. నెలకు రూ.2,495 ప్రీమియం చెల్లిస్తే గరిష్ఠంగా రూ.30 లక్షల వరకూ ఆరోగ్యబీమా సౌకర్యం కల్పిస్తోంది. ఇంతకన్నా మెరుగ్గా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రమాద బీమా, ఇతర సౌకర్యాలు కల్పించేందుకు బ్యాంకులతో తెలంగాణ ఆర్దిక శాఖ అధికారులు చర్చిస్తున్నారు. దీనికి సంబంధించి ఉద్యోగ సంఘాలతోనూ చర్చించి.. అమలు విధి విధానాలు ఖరారు చేయనున్నారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు












Click it and Unblock the Notifications