ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపు - బకాయిల చెల్లింపుకు ఆమోదం..!?

తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కార్యాచరణ సిద్దం చేస్తోంది. ఆర్దిక పరమైన అంశాలతో పాటుగా హెల్త్ కార్డుల పైన ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. రేపు (గురు వారం) జరిగే మంత్రివర్గ సమావేశంలో డీఏ తో పాటుగా బకాయిల చెల్లింపు పైన నిర్ణయానికి ఆమో ద ముద్ర వేయనున్నారు. అదే విధంగా ఉద్యోగుల పదవీ విరమణ వయసు ఏడాది పాటు పెంచాల నే ప్రతిపాదన పైన చర్చ జరుగుతోంది. దీని పై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. పెండింగ్ బిల్లుల చెల్లింపు కు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం.

కీలక నిర్ణయాలు
తెలంగాణలో ఉద్యోగుల సమస్యల పైన ప్రభుత్వం ప్రత్యేకంగా ఫోకస్ చేసింది. రేపు జరిగే మంత్రి వర్గ భేటీలో సమస్యల పరిష్కారానికి రోడ్ మ్యాప్ ఖరారు చేయనున్నారు. ఇదే సమయంలో ఉద్యోగుల పదవీ విరమణ వయసు పైన చర్చ జరుగుతోంది. పదవీ విరమణ వయస్సును 61 నుంచి 62 ఏళ్లకు పెంచాలని భావిస్తున్నట్లు చర్చ జరుగుతోంది. ఏడాదికి సుమారు రూ.9 వేల కోట్ల రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లించాల్సి ఉండటంతో ఈ ప్రతిపాదన పైన భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నిర్ణయం అమలు చేస్తే పదోన్నతుల తో పాటుగా కొత్తగా ఉద్యోగ అవకాశా ల పైన ప్రభావం పడుతుందనే వాదన ఉంది. దీంతో, ఈ ప్రతిపాదన పైన అన్ని కోణాల్లో చర్చించి ఆ తరువాతనే తుది నిర్ణయం తీసుకుంటారని సమాచారం. ఇక, ఉద్యోగుల ఆర్దిక ప్రయోజనాల విషయంలోనూ ప్రభుత్వం చర్చలు చేస్తోంది.

tg-govt-to-clear-employees-issues-in-cabinet-meet-as-latest-discussions-with-jac

మంత్రివర్గంలో ఆమోదం
రేపు (గురువారం) ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో క్యాబినెట్‌ భేటీ జరగనుంది. దీంతో రాష్ట్రంలోని ఉద్యోగులు, యువత, రైతాంగం.. తమ ఆశలన్నీ మంత్రివర్గ సమావేశంపైనే పెట్టుకున్నారు. తాము లేవనెత్తిన డిమాండ్లలో ఆర్థిక, ఆర్థికేతర అంశాలపై క్యాబినెట్‌లో ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉందని ఉద్యోగులు భావిస్తున్నారు. ఇటీవల ప్రభుత్వానికి, ఉద్యోగ సంఘాలకు మధ్య భేదాభిప్రాయాలు రావడం, సర్కారు వెంటనే అధికారుల కమిటీని ఏర్పాటు చేసారు. ప్రస్తుతం ఈ కమిటీతో ఉద్యోగ సంఘాలు భేటీ అయ్యాయి. ఈ కమిటీ ఉద్యోగుల డిమాండ్లను, ప్రతిపాదనలను విని మే 31న తన నివేదికను మంత్రివర్గ ఉపసంఘానికి అందజేసింది. ఆ నివేదికపై క్యాబినెట్‌లో కీలక చర్చ జరగనుంది. కాగా, ఉద్యోగులు కోరుతున్న ఐదు డీఏలలో ఒక డీఏపై ప్రభుత్వం సానుకూలంగా ఉండగా.. రెండో డీఏ ఇచ్చే విషయంపై చర్చ జరగనుంది.

బిల్లుల చెల్లింపు
అదే విధంగా పెండింగ్‌ బిల్లుల చెల్లింపుపై ఉద్యోగులు డిమాండ్‌ చేస్తున్నట్లు రూ.11 వేల కోట్లను గ్రీన్‌ చానల్‌ ద్వారా ఒక్కో విడతలో ఎంత చెల్లించాలనే దానిపైనా స్పష్టత వస్తుందని భావిస్తు న్నారు. నెలకు రూ.1000 కోట్ల చొప్పున చెల్లిస్తారా? లేక విడతల వారీగా ప్రాధాన్య క్రమంలో చెల్లింపులు ఉంటాయా? అనే అంశాలపై క్యాబినెట్‌లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇక ఉద్యోగుల సాధారణ బదిలీలు ఏటా చేయడానికి ప్రభుత్వం సుముఖంగానే ఉంది. ఉద్యోగుల ఆర్థికేతర డిమాండ్లలో 44 డిమాండ్లను అధికారుల కమిటీ నివేదికలో ప్రధానంగా ప్రస్తావించగా.. అందులో దాదాపు అన్ని డిమాండ్లను పరిష్కరించేందుకు ప్రభుత్వం సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. మంత్రివర్గంలో చర్చించాల్సిన అంశాల పైన ఈ భేటీలో చర్చించి.. పరి ష్కార మార్గాలను కేబినెట్ కు ప్రతిపాదించనున్నారు. దీంతో, ఈ సారి మంత్రివర్గ భేటీలో ఉద్యోగు ల సమస్యలకు పరిష్కారం దొరికే అవకాశం కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+