ఉచిత ప్రయాణంలో మహిళలకు మరో బంపరాఫర్, ఇలా చేస్తేనే..!!
మహిళల ఉచిత బస్సు పథకానికి భారీ స్పందన కనిపిస్తోంది. ప్రభుత్వం సైతం మహాలక్ష్మీ పథకాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తోంది. మహిళా ప్రయాణీకుల కోసం ఆర్టీసీ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. పథకం అమల్లో భాగంగా ప్రత్యేక బస్సులు.. స్మార్ట్ కార్డుల జారీ పైన ఆర్టీసీ కసరత్తు తుది దశకు చేరింది. ఇక.. ఇదే సమయంలో మహిళలకు బస్సు సదుపాయం పైన తాజాగా మరో వెసులుబాటు కల్పించింది. ఈ మేరకు ఆర్టీసీ తాజా నిర్ణయం వెల్లడించింది.
తెలంగాణ ఆర్టీసీ ప్రయాణీకుల్లో సేవల్లో కీలక మార్పులు చేస్తోంది. ప్రయాణీకులకు చేరువ అయ్యేలా సంస్కరణలు అమలు చేస్తోంది. అందులో భాగంగా బస్సుల నిర్వహణ పైన ఎప్పటికి అప్పుడు సమాచారం అందించేందుకు సాంకేతికతను వినియోగిస్తోంది. ఇందు కోసం కొత్తగా యాప్ ఆవిష్కరణ ద్వారా బస్సుల ట్రాకింగ్ సమాచారం అందుబాటులోకి తెస్తోంది. ఇదే సమయంలో ఇక గుర్తింపు కార్డులుగా ఆధార్ తో అవసరం లేకుండా నిర్ణయాలు అమలు చేస్తోంది. మహిళలకు కొత్తగా స్మార్ట్ కార్డులు ఇచ్చేందుకు ముందుగా హైదరాబాద్ లో పైలెట్ ప్రాజెక్టు ప్రారంభించేందుకు తుది సన్నాహకాలు జరుగుతున్నాయి. ఆ తరువాత రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయనున్నారు. ఇక, ఇప్పుడు మహిళలకు మరో కీలక వెసులుబాటు కల్పించేలా నిర్ణయం తీసుకున్నారు.

ప్రయాణీకులకు ఆర్టీసీ సమాచారం ఎప్పటికప్పుడు అందించేందుకు గమ్యం యాప్ ను ప్రస్తుతం వినియోగిస్తున్నారు. ఈ యాప్ లో మహిళా ప్రయాణికుల కోసం సరికొత్త సదుపాయాన్నిరాష్ట్ర వ్యాప్తంగా అందుబాటు లోకి తెచ్చింది. యాప్‌లో 'ఫ్లాగ్ ఏ బస్సు' ఆప్షన్‌ను నొక్కడం వల్ల మహిళలు రోడ్డుపై ఆర్టీసీ బస్సు ను నిలిపి అందులో ప్రయాణించవచ్చు. అయితే ఈ సదుపాయం సాయంత్రం 7 నుంచి ఉదయం 5 గంటల మధ్య మాత్రమే అందుబాటులో ఉంటుంది. మహిళలు గమ్యం యాప్‌లో 'ఫ్లాగ్ ఏ బస్సు' ఆప్షన్‌ను నొక్కడంతో సెల్ ఫోన్ స్ర్కీన్ మొత్తం ఆకుపచ్చ రంగులోకి మారుతుంది. సెల్‌ఫోన్ చేతిలో పట్టుకుని కదపడం వల్ల.. వారిని మహిళా ప్రయాణికులుగా గుర్తించి డ్రైవర్ వెంటనే బస్సు నిలుపుతారు. దీని ద్వారా రాత్రి సమయాల్లో మహిళా ప్రయాణీకులు బస్సుల కోసం ఇబ్బంది పడకుండా ఈ వెసులుబాటు కల్పించారు.












Click it and Unblock the Notifications