TGSRTC: శివరాత్రికి 3వేల ప్రత్యేక బస్సులు... కానీ భక్తులకు షాక్!
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని టి జి ఎస్ ఆర్ టి సి అన్ని ఏర్పాట్లు చేసింది. రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల నుంచి ప్రముఖ శైవక్షేత్రాలకు ప్రత్యేక బస్సులను నడపాలని నిర్ణయించింది. మొత్తం రాష్ట్రంలోని 43 శైవ క్షేత్రాలకు 3000 ప్రత్యేక బస్సులను నడపనున్నట్టు శుభవార్త చెప్పింది.
మహా శివరాత్రికి ప్రత్యేక బస్సులు.. కానీ షాకింగ్ ట్విస్ట్ ఇచ్చిన టీజీఎస్ ఆర్టీసీ
ఈనెల 26వ తేదీ మహాశివరాత్రి కాగా 24వ తేదీ నుంచి 28వ తేదీ వరకు ఈ ప్రత్యేక బస్సులను సంస్థ నడపనున్నట్లు వెల్లడించింది. మహాశివరాత్రి పర్వదినాన భక్తులకు శైవ క్షేత్రాలకు వెళ్లడానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇదే సమయంలో టిజిఎస్ ఆర్టీసీ షాకింగ్ ట్విస్ట్ కూడా ఇచ్చింది.

అదనపు చార్జీలు.. ప్రత్యేక బస్సుల ముందు భాగంలో డిస్ ప్లే బోర్డులు
రెగ్యులర్ సర్వీసుల చార్జీలలో ఎటువంటి మార్పు ఉండదని ప్రకటించిన టిజిఎస్ ఆర్టిసి ప్రత్యేక బస్సుల్లో మాత్రం 50% వరకు అదనపు చార్జీలను వసూలు చేస్తామని ప్రకటించింది. ఇక ప్రయాణికులకు ఈ విషయం తెలియజేయడం కోసం ప్రత్యేక బస్సుల ముందు భాగంలో డిస్ ప్లే బోర్డులను కూడా ఏర్పాటు చేసింది. దీంతో ప్రయాణికులకు బస్సు ఎక్కేముంది చార్జీల విషయం అవగతం అవుతుంది. అటువంటి సమయాల్లో వారికి ఇష్టమైతేనే బస్సు ఎక్కవచ్చు.
ఈసారి 809 బస్సులను అదనంగా నడపనున్న టీజీఎస్ ఆర్టీసీ
గత శివరాత్రి తో పోలిస్తే ఈసారి 809 బస్సులను అదనంగా నడపనున్నట్టు టీజీఎస్ ఆర్టీసీ ఎండి బీసీ సజ్జనార్ తెలిపారు ఇక ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు కొనసాగుతున్న ఉచిత బస్సు ప్రయాణం యధావిధిగా కొనసాగుతుందని పేర్కొన్నారు హైదరాబాద్ నుంచి శ్రీశైలం వేములవాడ వెళ్లే ప్రత్యేక బస్సులకు ముందస్తు రిజర్వేషన్స్ సౌకర్యాన్ని కూడా కల్పించినట్టు తెలిపారు.
ఏ శైవ క్షేత్రాలకు ఎన్ని బస్సులంటే
శ్రీశైలానికి 800 బస్సులు, వేములవాడకు 714 బస్సులు, ఏడుపాయలకు 44 బస్సులు, కీసర గుట్టకు 270, వేలకు 171, కొమురవెల్లికి 51 బస్సులతో పాటు, అలంపూర్, ఉమామహేశ్వరం, పాలక్ తదితర ఆలయాలకు ప్రత్యేక బస్సులు నడపనున్నారు. ఇక ప్రత్యేక బస్సులు ఏర్పాటు మాత్రమే కాదు ప్రయాణాలు చేసే భక్తుల కోసం మౌలిక వసతులను కూడా కల్పించడానికి టి జి ఎస్ ఆర్ టి సి దృష్టి పెట్టింది.












Click it and Unblock the Notifications