TGSRTC: ప్రధాన నగరాల ప్రయాణ టికెట్ ధరల పై రాయితీ, కొత్త రేట్లు..!!

తెలంగాణ ఆర్టీసీ కీలక ప్రకటన చేసింది. ప్రయాణీకుల కోసం ప్రధాన రూట్లలో టికెట్ రాయితీలు ప్రకటించింది. ఇప్పటికే రద్దీ ఉన్న మార్గాల్లో ఆక్యుపెన్సీ పెంచుకొనే విధంగా ఆర్టీసీ నిర్ణయాలు అమలు చేస్తోంది. అదే విధంగా టూర్ ప్యాకేజీలు అందుబాటులోకి తీసుకొస్తోంది. హైదరాబాద్ నగరం నుంచి ప్రధాన ప్రాంతాలకు వెళ్లే బస్సు సర్వీసుల్లోనూ మార్పులు ప్రారంభించింది. ఇక, ప్రయివేటు ఆపరేటర్లకు ధీటుగా సేవలకు ప్రణాళికలు సిద్దం చేస్తున్న ఆర్టీసీ.. రెండు ముఖ్యమైన రూట్లలో టికెట్ ధరల్లో రాయితీ ప్రకటించింది.

హైద‌రాబాద్ నుంచి బెంగ‌ళూరు, విజ‌య‌వాడ మార్గాలలో న‌డుస్తున్న టీజీఎస్ఆర్‌టీసీ బ‌స్సుల టికెట్ ధ‌ర‌ల‌ను సంస్థ భారీగా త‌గ్గించింది. ఛార్జీల‌పై 16 నుంచి 30 శాతం వ‌ర‌కు రాయితీలు ప్ర‌క‌టిస్తూ నిర్ణ‌యం తీసుకుంది. విజ‌య‌వాడ‌కు గ‌రుడ ప్ల‌స్ బ‌స్సు టికెట్ ధ‌ర రూ. 635 నుంచి రూ. 444కు, గ‌రుడ క్లాస్ ధ‌ర రూ. 592 నుంచి రూ. 438కు, రాజ‌ధాని రూ. 533 నుంచి రూ. 448, ల‌గ్జ‌రీ సూప‌ర్ క్లాస్ ధ‌ర రూ. 815 నుంచి రూ. 685కు త‌గ్గించింది. అలాగే బెంగ‌ళూరు మార్గంలో సూప‌ర్‌ల‌గ్జ‌రీ బ‌స్సు టికెట్ ధ‌ర రూ. 946 నుంచి రూ. 757కు, ల‌హ‌రి ఏసీ స్లీప‌ర్ బ‌స్సులో బెర్త్ రూ. 1569 నుంచి రూ. 1177కు, ల‌హ‌రి ఏసీ స్లీప‌ర్ బెర్త్ క‌మ్ సీట‌ర్ ధ‌ర రూ. 1203 నుంచి రూ. 903కు, బెర్త్ రూ. 1569 నుంచి రూ. 1177కు త‌గ్గించింది.

TGSRTC announces concession for Banglore and Vijayawada buses new Rates here

నిత్యం విజయవాడ, బెంగళూరు మార్గాల్లో పలు ప్రాంతాల నుంచి బయల్దేరే బస్సులకు డిమాండ్ ఉంది. దీంతో, సర్వీసులు పెంచుతూనే... ప్రయాణీకులను ఆకర్షించే ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో భాగంగా ఈ రెండు రూట్లలో రాయితీలను ప్రకటించింది. ఈ రాయితీలు ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్ బుకింగ్‌ల‌కు వ‌ర్తిస్తాయ‌ని ఆర్‌టీసీ ప్ర‌క‌టించింది. ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకో వాలని టీజీఎస్ ఆర్టీసీ సంస్థ యాజమాన్యం ప్రయాణికులను కోరింది. ముందస్తు రిజర్వేషన్‌ కోసం తమ సంస్థ వెబ్‌సైట్‌ https://www.tgsrtcbus.inను సంప్రదించవచ్చని ప్రయాణికులకు సూచించింది. గతంలోనూ ఈ రెండు మార్గాల్లో రాయితీ ద్వారా ప్రయాణీకుల సంఖ్య పెరిగింది. దీంతో, ఇప్పుడు మరోసారి రాయితీను ప్రకటించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+