Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

శ్రీశైలం,అరుణాచలం, కంచితో సహా - పుణ్యక్షేత్రాలకు ఆర్టీసీ టూర్‌ ప్యాకేజీలు..!!

తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించింది. పుణ్యక్షేత్రాలకు వెళ్లాలను కొనే భక్తుల కోసం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వెళ్లే ఆలయాలను కలుపుతూ స్పెషల్ ప్యాకేజీ ఖరారు చేసింది. మేడారం జాతర వేళ ఆర్టీసీ ఇప్పటికే ప్రత్యేక బస్సులతో పాటుగా ఛార్జీలను ఖరారు చేసింది. ఇప్పుడు ఏపీ, తమిళనాడులోని ప్రధాన ఆలయాలకు ఈ ప్యాకేజీని ఖరారు చేసింది. అదే విధంగా గోవా కు సైతం ఆర్టీసీ మరో ప్యాకేజీ సిద్దం చేసింది. ఈ యాత్రకు సంబంధించిన వివరాలను ఆర్టీసీ వెల్లడించింది.

తెలంగాణ ఆర్టీసీ ప్రయాణీకులకు బిగ్ అప్డేట్ ఇచ్చింది. ఏపీ, తమిళనాడులోని ప్రధాన ఆలయాల కు రాష్ట్రం నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వెళ్తున్నారు. వీరి కోసం ప్రధాన ఆలయాల సందర్శన కు వీలుగా స్పెషల్ ప్యాకేజీ ప్రకటించింది. మేడారం జాతర వేళ.. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. అన్ని కేటగిరీల బస్సులను మేడారం కు నడపాలని నిర్ణయం తీసుకుంది. ఇదే సమయంలో ఇప్పుడు ఆర్టీసీ ప్రకటించిన ప్యాకేజీలో పలు ప్రధాన ఆలయాలు ఉన్నాయి.

TGSRTC announces special tour packages for Famous temples and Goa

తెలుగు రాష్ట్రాల్లోని కాళేశ్వరం, మేడారం, శ్రీశైలం తో పాటుగా తమిళ నాడు లోని అరుణాచలం, కంచి వంటి ప్రాంతాలకు సెలవు రోజుల్లో బీహెచ్‌ఈఎల్‌ డిపో నుంచి సూపర్‌ లగ్జరీ, రాజధాని బస్సులను నడుపుతోంది. ఈనెల 23న బీహెచ్‌ఈఎల్‌ డిపో నుంచి బయలుదేరి గానుగాపూర్‌, పండరీపూర్‌, కోల్హాపూర్‌, తుల్జాపూర్‌ ప్రాంతాలను చుట్టివచ్చేలా రూ. 3 వేల చార్జీతో (1నైట్‌, 2 డేస్‌)ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించారు.

అదే విధంగా ఫిబ్రవరి 6వ తేదీన గోవా యాత్ర పేరుతో (3నైట్స్‌, 4డేస్‌) నగరం నుంచి ఆర్టీసీ ప్రత్యేక సర్వీసును నడుపుతుంది. ఒక్కొక్కరికి రూ.3,500 చార్జీతో హంపి, గోవా, తుల్జాపూర్‌ను చుట్టివచ్చేలా ప్యాకేజీని రూపొందించారు. ఇతర వివరాలకు కోసం 9391072283, 9063401072 నంబర్లలో సంప్రదించవచ్చని అధికారులు తెలిపారు.

అలాగే గ్రేటర్‌జోన్‌లోని పలు డిపోల నుంచి మేడారం వెళ్లే భక్తుల కోసం ప్రత్యేక బస్సులను కూడా నడుపుతున్నట్లు ఆర్టీసీ అధికారులు వివరించారు. తెలంగాణ నుంచి పలు ప్రాంతాలకు ప్రయాణీకుల డిమాండ్ మేరకు బస్సులను నడుపుతున్నట్లు అధికారులు వెల్లడించారు. ఆర్టీసీ ప్రకటిస్తున్న ప్యాకేజీలకు ప్రయాణీకుల నుంచి మంచి ఆదరణ కనిపిస్తోంది. దీంతో, మరిన్ని పెంచేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+