Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

TGSRTC బస్సు ప్రమాదం- అందుబాటులో ఉన్న మంత్రులకు సీఎం కఠిన ఆదేశాలు

రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 18 మంది ప్రయాణికులు దుర్మరణం పాలయ్యారు. 20 మందికిపైగా గాయపడ్డారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. గాయపడ్డ వారిని అంబులెన్స్ ల ద్వారా హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.

ఈ తెల్లవారు జామున జిల్లాలోని చేవెళ్ల సమీపంలో ఈ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ నుంచి తాండూరుకు బయలుదేరి వెళ్తోన్న టీజీఎస్ఆర్టీసీ బస్సు నంబర్ టీఎస్ 34 టీఏ 6354 ఎక్స్ ప్రెస్ బస్సు ప్రమాదానికి గురైంది. ఖానాపూర్ గేట్ సమీపంలో రాంగ్ రూట్ లో వచ్చిన నంబర్ టీజీ 06 టీ 3879 భారీ టిప్పర్ బస్సును వేగంగా ఢీకొట్టింది. కంకర లోడ్ తో వెళ్తోన్న టిప్పర్ అది.

TGSRTC Bus accident CM Revanth Reddy asked the available ministers to immediately reach the site

బస్ డ్రైవర్ హారన్ మోగిస్తూ, హెడ్ లైట్లను వెలిగిస్తూ హెచ్చరిస్తోన్నప్పటికీ రాంగ్ రూట్ లో వచ్చిన టిప్పర్ ఢీ కొట్టింది. టిప్పర్ ను తప్పించడానికి డ్రైవర్ కుడి వైపు బస్సును తిప్పినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. టిప్పర్ ఢీ కొట్టిన వేగానికి బస్సు కుడి వైపు భాగం మొత్తం కోసుకుపోయింది. బస్సు ముందు భాగం, డ్రైవర్ క్యాబిన్ నుజ్జునుజ్జయింది. డ్రైవర్, ప్రయాణికులను వెలికి తీయడానికి శ్రమించాల్సి వచ్చింది.

ఢీకొట్టిన తర్వాత టిప్పర్ బస్సుపై వాలిపోయింది. అందులో ఉన్న కంకర మొత్తం బస్సులో పడింది. దాని మధ్య పలువురు ప్రయాణికులు చిక్కుకుపోయారు. 18 మంది సంఘటన స్థలంలోనే మరణించారు. మరో 20 మందికి పైగా గాయపడ్డారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. గాయపడ్డ వారిని అంబులెన్స్ ల ద్వారా హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.

క్షతగాత్రుల్లో ఓ కానిస్టేబుల్ కూడా ఉన్నారు. గాయపడ్డ వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. సంఘటన స్థలం మొత్తం హాహాకారాలతో నిండిపోయింది. చలిలో, ఒంటికి తాకిన గాయాలతో ప్రయాణికులు రోడ్డు పక్కన రోదిస్తూ కనిపించారు. అంబులెన్సులు, పోలీసు వాహనాల సైరన్లతో సంఘటన స్థలం మొత్తం భీతావహంగా మారింది. ఈ ఘటనపై రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. విచారణకు ఆదేశించారు.

ఈ రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ ఘటనలో గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు. ప్రమాద స్థలానికి వెంటనే చేరుకుని సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు తెలియజేయాలని సూచించారు. ఈ ఘటనపై సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులను కోరారు.

బస్సు ప్రమాదంలో గాయపడిన వారిని తక్షణమే హైదరాబాద్ తరలించి, వారికి అత్యుత్తమ వైద్యం అందేలా చూడాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పోలీస్ డైరెక్టర్ జనరల్ ను ఆదేశించారు. ప్రమాద స్థలానికి వెంటనే చేరుకోవాలని, సహాయక కార్యక్రమాలను పర్యవేక్షించాలని అందుబాటులో ఉన్న మంత్రులను రేవంత్ రెడ్డి ఆదేశించారు. బాధితులకు అన్ని విధాలా అండగా ఉండాలని సూచించారు. ఈ ఘటనపై ప్రభుత్వం తరపున అన్ని సహాయక చర్యలు చేపడుతుందని స్పష్టం చేశారు.

భారత్ రాష్ట్ర సమితి అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్.. తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. మృతుల కుటుంబాలకు తక్షణమే ఆర్థిక సహాయం అందించాలని సూచించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+