మహాశివరాత్రి జాతరకు 780 ప్రత్యేక బస్సులు..!!
మహాశివరాత్రికి తెలంగాణలోని ప్రముఖ ఆలయాలు సిద్దం అవుతున్నాయి. వేములవాడకు భారీ సంఖ్యలో భక్తులు తరలి వస్తారని అంచనా వేస్తున్నారు. ప్రతీ ఏటా మహాశివరాత్రికి వచ్చే భక్తుల సంఖ్యకు అనుగుణంగా ఈ సారి కూడా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. కాగా, రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచే భక్తులకు వేములవాడ నుంచి మహాశివరాత్రి జాతరకు 780 ప్రత్యే బస్సులు నడపాలని ఆర్టీసీ నిర్ణయించింది.
మహాశివరాత్రికి వేములవాడకు భారీ సంఖ్యలో భక్తులు తరలి రానున్నారు. పలు ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల కోసం ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. అందులో భాగంగా భక్తుల సౌకర్యార్ధం ఈ నెల 25, 26, 27 తేదీల్లో జరిగే మహాశివరాత్రి జాతరకు 780 ప్రత్యేక బస్సులు నడపాలని నిర్ణ యం తీసుకున్నారు. ప్రత్యేక చార్జీలు వసూలు లేకుండానే హైదరాబాద్ వరంగల్ కరీంనగర్, కామారెడ్డి కోరుట్ల, మెట్ పల్లి జగిత్యాలతోపాటు పలు ప్రాంతాల నుండి ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సు లను నడిపిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

గత ఏడాది శివరాత్రి వేళ 680 ప్రత్యేక బస్సులు నడిపారు. కాగా, ఈ ఏడాది మరో వంద బస్సు సర్వీసును అదనంగా కేటాయించాలని నిర్ణయించారు. మహాశివరాత్రి మూడు రోజుల జాతర కోసం దాదాపు లక్ష మంది భక్తులు రాకపోకలు సాగించే అవకాశం ఉంది. దీంతో, ఈ మేరకు బస్సులను ఏర్పాటు చేయాలని డిసైడ్ అయ్యారు. తిప్పాపూర్, జగిత్యాల బస్టాండ్ నుండి ప్రత్యేకంగా ఈ బస్సులు నడవనున్నాయి. తిప్పాపూర్ బస్టాండ్ నుండి రాజన్న ఆలయానికి ఫిబ్రవరి 25, 26, 26 తేదీల్లో 14 బస్సులు ఉచితంగా ఏర్పాటు చేశారు.












Click it and Unblock the Notifications