TGSRTC గుడ్ న్యూస్, కొత్తగా పుష్పక్ బస్సులు.. రూ 100కే - ఈ మార్గాల్లో..!!

TGSRTC కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ ఆర్టీసీ ప్రయాణీకులకు బిగ్ అప్డేట్ ఇచ్చింది. ఇప్పటి వరకు విమానాశ్రయం వరకు పరిమితం అయిన పుష్పక్ ఏసీ బస్సులను హైదరాబాద్ లోని పలు మార్గాల్లో అందుబాటులోకి తీసుకొచ్చింది. రూ 100 కే నగరంలో ప్రయాణించేలా తాజా నిర్ణయం ప్రకటించింది. దీని ద్వారా సామాన్య ప్రయాణీకులకు వెసులు బాటు కలగనుంది. కాగా.. ఈ బస్సులు ప్రారంభించే మార్గాల పైన స్పష్టత ఇచ్చింది. దీంతో.. ప్రస్తుతం సమస్యకు చెక్ పడనుందని అధికారులు చెబుతున్నారు.

టీజీఎస్ ఆర్టీసీ సాధారణ ప్రయాణీకుల కోసం బిగ్ డెసిషన్ ప్రకటించింది. ఇప్పటి వరకు ఏయిర్ పోర్టుకు వెళ్లేందుకే పరిమితం అయిన పుష్పక్ ఏసీ బస్సులను హైదరాబాద్ నగరంలోనూ పలు ప్రాంతాల్లో అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. రూ 100 కే ఒక మార్గం నుంచి మరో మార్గం కు వెళ్లే వెసులుబాటు కల్పించింది. ఎంపిక చేసిన మార్గాల్లో ప్రతీ అరగంటకు ఒక పుష్పక్ బస్సును ఏర్పాటు చేస్తున్నారు. ఈ ప్రయాణానికి కనీస ఛార్జీగా రూ.100 నిర్ణయించినట్లు అధికా రులు పేర్కొంటున్నారు. దీంతో విమానాశ్రయానికి వెళ్లే అవసరం లేకపోయినా పుష్పక్ ఏసీ బస్సు లను నగర ప్రయాణాలకు ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. మరోవైపు నగర ప్రయాణికుల కోసం ఆర్టీసీ ఇటీవల వారపు బస్ పాస్ సౌకర్యాన్ని కూడా అందుబాటులోకి తెచ్చింది.

వార‌ణాసి, బెంగళూరుకు వందే భారత్ స్లీపర్- రిజర్వేషన్ షురూ, రూట్.. షెడ్యూల్..!!
వార‌ణాసి, బెంగళూరుకు వందే భారత్ స్లీపర్- రిజర్వేషన్ షురూ, రూట్.. షెడ్యూల్..!!
tgsrtc-expands-pushpak-ac-bus-services-in-hyderabad-in-selected-routes-details-here

టీజీఎస్ ఆర్టీసీ తాజా నిర్ణయాలతో

దీని ద్వారా రూ.600 చెల్లించి కొనుగోలు చేసే ఈ వీక్లీ పాస్ వరుసగా ఏడు రోజుల పాటు చెల్లుబాటు అవుతుంది. కొత్తగా ప్రవేశ పెట్టిన ఈ పుష్పక్ బస్సులను జేబీఎస్ నుంచి విమానాశ్రయం వరకు ఉప్పల్, ఎల్ బీ నగర్, బాలాపూర్ మీదుగా వెళ్లే ఏసీ బస్సులను ప్రతీ 30 నిమిషాలకు ప్రకటన చేసారు. అదే విధంగా జేబీఎస్ - సికింద్రాబాద్ స్టేషన్ నుంచి ఎన్ఎండీసీ, మెహదీపట్నం, ఆరాం ఘర్ మీదుగా ఏయిర్ పోర్టు వరకు సర్వీసు ప్రారంభించారు. ప్రతీ గంటలకు జేబీఎస్ నుంచి సికింద్రాబాద్ స్టేషన్, అసెంబ్లీ, అఫ్జల్ గంజ్ మీదుగా ఏయిర్ పోర్టుకు మరో సర్వీసు అందుబాటు లోకి తీసుకొచ్చారు. ప్రయివేటు వాహనాలు, క్యాబ్ ల కంటే తక్కువ ధరకే.. సురక్షితంగా ఈ పుష్పక్ బస్సులు అందుబాటులో ఉంటాయని అధికారులు వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+