TGSRTC శుభవార్త.. త్వరలోనే మీకోసం అందుబాటులోకి కొత్త బస్సులు.. వాళ్లకు బంపర్ ఆఫర్!

తెలంగాణ ప్రభుత్వం మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తోంది. తెలంగాణాలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలోని కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా మార్చే లక్ష్యంతో అనేక ప్రత్యేక పథకాలను అమలు చేస్తోంది. ఇప్పటికే మహిళా పొదుపు సంఘాల ద్వారా పెట్రోల్‌ బంకులు, ఆహార పరిశ్రమలను సక్సెస్ ఫుల్ గా నిర్వహిస్తోంది. ఇదే స్ఫూర్తితోనే 'ఇందిరా మహిళా శక్తి' పథకాన్ని కూడా విస్తృతంగా అమలు పరుస్తోంది.

టీజీఎస్‌ఆర్టీసీ ద్వారా మహిళలకు ఆర్ధిక భరోసా

ఈ పథకంలో భాగంగా టీజీఎస్‌ఆర్టీసీ ద్వారా కూడా మహిళలకు ఆర్ధిక భరోసా కల్పిస్తుంది. మహిళా పొదుపు సంఘాల నిధులతో బస్సులను కొనుగోలు చేసి ఆర్టీసీ ద్వారా ఆదాయం సంపాదించటానికి వారికి అవకాశం ఇచ్చింది. గత సంవత్సరం మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ ప్రత్యేక పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు.

TGSRTC good news 200 new buses on roads soon from women self help groups after govt approval

త్వరలో ప్రారంభం కానున్న 200 బస్సులు

ప్రస్తుతం 152 బస్సులను మహిళా సంఘాల సమాఖ్యలు టీఎస్‌ఆర్టీసీకి అద్దెకు ఇచ్చాయి.ఈ బస్సుల ద్వారా నెలకు ఒక్కో బస్సుకు రూ.69,468 చొప్పున అద్దెను ఆర్టీసీ చెల్లిస్తోంది.ఈ బస్సులకు డ్రైవర్ లను, కండక్టర్ లను ఆర్టీసీనే నియమిస్తోంది. కాగా, మరిన్ని బస్సులు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, 200 బస్సుల బాడీ బిల్డింగ్ పనులు పూర్తయ్యి, ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నాయి.

ఈ జిల్లాలలో పైలెట్ ప్రాజెక్ట్ సక్సెస్

ఈ బస్సులను మాత్రమే కాదు మరో 248బస్సులు వచ్చే మార్చి నెలాఖరు నాటికి అందుబాటులోకి తీసుకురానున్నారు. ప్రభుత్వం నుండి గ్రీన్ సిగ్నల్ రాగానే మొదట 200 బస్సులు, ఆపై మార్చి చివరివరకు 248బస్సులు ప్రయాణికులకు అందుబాటులోకి వస్తాయి. అయితే గత సంవత్సరం ప్రారంభించిన ఈ పైలెట్ ప్రాజెక్ట్ కోసం మహబూబ్‌నగర్, కరీంనగర్, వరంగల్ జిల్లాలను ఎంపిక చేసి 152బస్సులను మొదట ప్రారంభించారు. అది ఇప్పుడు సక్సెస్ ఫుల్ గా సాగుతుంది.

గతంలో ప్రైవేట్ వ్యక్తుల నుండి బస్సులు అద్దెకు.. ఇప్పుడు మహిళల నుండే

మహిళా సంఘాల నుంచి రుణాలు తీసుకున్న కారణంగా ఆర్టీసీ ఆయా బస్సులను ఆ సంఘాలకు హైపోథికేషన్ చేసింది. గతంలో ప్రైవేటు వ్యక్తుల నుంచి బస్సులను అద్దెకు తీసుకుని ఆర్టీసీ సంస్థ తన కార్యకలాపాలను నిర్వహించేది. ఇప్పుడు అదే మహిళా సంఘాల నుండి బస్సులను అద్దెకు తీసుకుని వారికి ఆర్ధిక భరోసా కల్పిస్తుంది. ఇందిరా మహిళా శక్తి పథకం క్రింద ఆర్టీసీకి మొత్తం 600 బస్సులను అద్దెకు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

మహిళా సాధికారతకు ఆర్టీసీ సువర్ణావకాశం

మొదటి విడతలో 152 బస్సులకు అనుమతి ఇచ్చారు. ఇప్పుడు మిగిలిన 448 బస్సులను కూడా అందించాలని సెర్ఫ్ నిర్ణయించింది. ప్రస్తుతం 200 బస్సులు కొత్తగా అందుబాటులోకి వస్తుండగా, మిగిలిన బస్సులు కూడా త్వరలోనే రోడ్డెక్కనున్నాయి. ఈ పథకం ద్వారా మహిళా సాధికారతకు, ఆర్టీసీ సేవలకు మరింత తోడ్పాటు లభిస్తుంది. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా సాధికారతకు కల్పించిన మరొక కొత్త అవకాశం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+