TGSRTC: రాఖీ పండుగతో ఆర్టీసీకి రికార్డు స్థాయిలో ఆదాయం..!
రాఖీ పౌర్ణమితో పాటు వరుస సెలవులు రావడంతో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీజీఎస్ఆర్టీసీ) రికార్డు స్థాయిలో ప్రయాణికులు ప్రయాణించారు. రాఖీ సందర్భంగా 63.86 లక్షల మందిని క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చినట్లు రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక్కరోజులో 41.74 లక్షల మంది మహిళలు ఉపయోగించుకున్నారని పేర్కొన్నారు. 21.12 లక్షల మంది నగదు చెల్లించి ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేసినట్లు పొన్న వివరించారు.
ఈ క్రమంలో ఆర్టీసీకి రికార్డు స్థాయిలో ఆదాయం వచ్చిట్లు తెలిపారు. రూ. 32 కోట్ల ఆదాయం వచ్చిందని వెల్లడించారు. ఇందులో మహాలక్ష్మి పథకం ద్వారా రూ.17 కోట్లు, నగదు చెల్లింపు టికెట్ల ద్వారా 15 కోట్ల వరకు వచ్చినట్లు ప్రకటించారు. ఆర్టీసీ చరిత్రలో ఒక్కరోజులో ఇంత మొత్తంలో ఆదాయం ఎప్పుడు లేదన్నారు. భారీ వర్షంలోనూ ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేరవేసిన ఆర్టీసీ సిబ్బందిని మంత్రి ప్రశంసించారు. ఆర్టీసి తన మొత్తం సామర్థ్యాన్ని ఉపయోగించుకుందని తెలిపారు.

ఉద్యోగులు రాత్రి ,పగలు శ్రమించి డ్యూటీ చేశారని అభినందించారు. క్షేత్రస్థాయి సిబ్బందితో ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుని రద్దీ ఉన్న రూట్లలో బస్సులు అదనంగా నడిపించినట్లు వివరించారు. రాఖీ పండగ ఉన్నప్పటికీ పని చేసిన ఆర్టీసి డ్రైవర్లు , కండక్టర్లను అభినందించరు. కొంత మంది డ్రైవర్లు, కండక్టర్లు ఫీల్డ్ లోనే బస్సుల్లో వారి సోదరీమణులు రాఖీలు కట్టారని పొన్నం గుర్తు చేశారు. కాగా మహా లక్ష్మి పథకం ద్వారా ఆర్టీసి లో మహిళా ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగిందని పేర్కొన్నారు.
రాఖీ పౌర్ణమి సందర్భంగా మహిళలు పెద్ద ఎత్తున ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించి సోదరులకు రాఖీ కట్టారని, వారందరినీ అభినందిస్తూ శుభకాంక్షలు చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మహాలక్ష్మి-మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని విజయవంతంగా ఆర్టీసీ అమలు చేస్తోందన్నారు. ఆర్టీసీని ఆదరిస్తోన్న, ప్రొత్సహిస్తోన్న ప్రతి ఒక్కరికీ పొన్నం ప్రభాకర్ గౌడ్ ధన్యవాదాలు తెలిపారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications