MGBS మూసివేత: ప్రయాణికులకు ముఖ్య గమనిక
మూసీ నదికి భారీ వరద నేపథ్యంలో హైదరాబాద్ మహాత్మగాంధీ సెంట్రల్ బస్ స్టేషన్ ప్రాంగణంలోకి వరద నీరు చేరింది. దీంతో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అధికారులు అప్రమత్తం అయ్యారు. ఎంజీబీఎస్ నుంచి బస్సుల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేశారు. ప్రత్యామ్నాయ మార్గాలను వెల్లడించారు. ఎంబీజీఎస్ నుంచి బయలుదేరే బస్సులను హైదరాబాద్ లోని వివిధ ప్రాంతాల నుంచి బస్సులను నడుపుతున్నట్లు తెలిపారు.
ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్, నిజామాబాద్ వైపు వెళ్లే బస్ సర్వీసులన్నింటినీ కూడా జూబ్లీ బస్ స్టేషన్ కు బదలాయించారు. ఈ మార్గంలో వెళ్లే బస్సులన్నీ జేబీఎస్ నుంచే రాకపోకలు సాగించనున్నాయి. వరంగల్, హన్మకొండ వైపు వెళ్లే బస్సులను ఉప్పల్ క్రాస్ రోడ్స్ నుంచి నడిపిస్తోన్నారు. ఈ రూట్ లో వెళ్లే బస్ సర్వీసులన్నీ ఈ పాయింట్ నుంచే ప్రయాణికులకు అందుబాటులోకి వస్తాయని తెలిపారు.

సూర్యాపేట, నల్లగొండ, విజయవాడ వైపు వెళ్లే బస్సులు ఎల్బీనగర్ నుంచి నడుస్తున్నాయి. మహబూబ్‌నగర్, కర్నూలు, బెంగళూరు వైపు వెళ్లే బస్సులను ఆరాంఘర్ జంక్షన్ నుంచి రాకపోకలు సాగిస్తోన్నట్లు టీజీఎస్ఆర్టీసీ అధికారులు తెలిపారు. మూసీ వరదనీరు చేరిన నేపథ్యంలో ఎంజీబీఎస్ కు ప్రయాణికులు ఎవరూ రావొద్దని విజ్ఞప్తి చేశారు. ఎంబీజీఎస్ నుంచి నడిచే బస్సులను ఇతర ప్రాంతాల నుంచి తిప్పుతున్నామని, ఆయా మార్గాల ద్వారా తమ గమ్యస్థానాలకు చేరుకోవాలని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు కాల్ సెంటర్ నంబర్లు 040-69440000, 040-23450033 సంప్రదించాలని సూచించారు.












Click it and Unblock the Notifications