టీజీఎస్ఆర్టీసీ తీపికబురు..ఉప్పల్‌లో కొత్త బస్ టెర్మినల్ తో పాటు మరో రెండు డిపోలు!

టీజీఎస్‌ఆర్టీసీ మరో శుభవార్త. తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ టీజీఎస్‌ఆర్టీసీ హైదరాబాద్‌లో ప్రజా రవాణా సౌకర్యాలు మెరుగుపరచేందుకు కొత్త ప్రణాళికలు రూపొందించింది. నగరం వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రజల అవసరాలకు తగ్గట్టు అక్కడ కొత్త బస్ టెర్మినల్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది.

ఉప్పల్ కొత్త బస్ టెర్మినల్ తో పాటు రెండు డిపోలు

హైదరాబాద్ నగరానికి ప్రతీ రోజూ ఉప్పల్ మీదుగా అనేక ప్రాంతాల వాళ్ళు ప్రయాణాలు సాగిస్తూ ఉంటారు. దీంతో ఉప్పల్ లో ప్రయాణికుల రద్దీ రోజురోజుకూ బాగా పెరుగుతుంది. ఉప్పల్‌లో కొత్త బస్ టెర్మినల్, మరో రెండు బస్ డిపోలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం ఉప్పల్ ఎలివేటేడ్ కారిడార్ నిర్మాణ పనులలో భాగంగా ఉప్పల్ నల్లచెరువు ప్రాంతంలో జిల్లా బస్సులు నిలుపుతున్నారు. అంతకు ముందు కూడా ఉప్పల్ మెట్రో సమీపంలో ఆర్టీసీ బస్సులు ఆగేవి.

TGSRTC Telangana RTC announces plans for a new bus terminal in Uppal and two additional depots

హైదరాబాద్-3 డిపో, జవహర్‌నగర్‌లో మరో డిపో ఏర్పాటుకు అడుగులు

ప్రస్తుతం కొనసాగుతున్న నల్ల చెరువు బస్ స్టాండ్ కూడా టెంపరరీ బస్ స్టాండ్ కాగా, దీనికి బదులు ఉప్పల్ వర్క్‌షాప్ సమీపంలో కొత్త టెర్మినల్ నిర్మించాలని ప్లాన్ చేస్తున్నారు. అంతేకాకుండా ముషీరాబాద్‌లో 4.5 ఎకరాల స్థలంలో హైదరాబాద్-3 డిపో, నాగారం రోడ్డు వద్ద జవహర్‌నగర్‌లో మరో డిపో ఏర్పాటుకు అడుగులు వేస్తోంది. గతంలో మూతపడిన రాణిగంజ్-2 డిపోను ఆధునిక సౌకర్యాలతో పునరుద్ధరించాలని కూడా నిర్ణయించారు.

ఆర్టీసీ బస్ టెర్మినల్స్ పెంచాలని లక్ష్యం

గాజులరామారం, బహదూర్‌గూడలో ఇప్పటికే టెర్మినళ్ల నిర్మాణం ప్రారంభమైంది. ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్‌లో 26 డిపోలు ఉండగా, వాటి సంఖ్యను 31కి పెంచాలని ఆర్టీసీ అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఎలక్ట్రిక్ బస్సుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో అదనపు డిపోలు, టెర్మినళ్లు అవసరమని అధికారులు భావిస్తున్నారు.

వెలిగొండ ప్రాజెక్ట్ పై ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాలకు మంత్రి నిమ్మల రామానాయుడు శుభవార్త!
వెలిగొండ ప్రాజెక్ట్ పై ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాలకు మంత్రి నిమ్మల రామానాయుడు శుభవార్త!

ప్రయాణికులకు ప్రయాణాలు సులభతరం చేసే ప్లాన్

రంగారెడ్డి, మేడ్చల్ జిల్లా కలెక్టర్లను స్థలాల కేటాయింపు కోసం కోరారు. త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. ఈ చర్యలు నగరంలో బస్సు సేవలను మరింత సమర్థవంతం చేస్తాయని ఆశిస్తున్నారు. ఆర్టీసీ ఈ బస్ టెర్మినల్స్, బస్ డిపోలను ఏర్పాటు చేస్తే, అవసరం అయిన చోట డిపోలను పునరుద్ధరించే పని చేస్తే నగరం నుండి ప్రయాణం చేసే వారికి ప్రయాణాలు చాలా సులభతరం అవుతాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
q