అబద్ధాలలో నెం. వన్ కేసీఆర్: తమ్మినేని, ఖాకీల ప్రభుత్వమని చాడ
టిఆర్‌ఎస్ ప్రభుత్వం ఇప్పుడు ఖాకీల ప్రభుత్వంగా మారిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి దుయ్యబ్టారు.
వరంగల్: టిఆర్‌ఎస్ ప్రభుత్వం ఇప్పుడు ఖాకీల ప్రభుత్వంగా మారిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి దుయ్యబ్టారు. ఆదివారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో మీడియా మ్లాడుతూ.. అభివృద్ధి పనులకు ప్రభుత్వం పైసా కూడా విదల్చడంలేదని ఆరోపించారు.
అంగన్‌వాడీ కార్యకర్తలకు జీతాలు, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్, మధ్యాహ్న భోజన వర్కర్లకు, ఉపాధి కూలీలకు ఇలా అందరికి బకాయిలతోనే ప్రభుత్వం నెట్టుకువస్తోందని పేర్కొన్నారు. పెద్దనోట్ల రద్దుపై జనవరి మొదటి వారంలో రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు చేపడుతామని తెలిపారు. కాగా, జోనల్ వ్యవస్థ రద్దు నిర్ణయం ప్రభుత్వ తొందరపాటు చర్య అని విమర్శించారు. సర్కార్ నిర్ణయం నిరుద్యోగుల పాలిట శాపమని మండిపడ్డారు.

అబద్ధాలలో కేసీఆరే నెంబర్ వన్: ఆర్: తమ్మినేని
అభివృద్ధిలో కాకుండా కేసీఆర్ అబద్దాలలో నెంబర్‌వన్‌గా నిలిచారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. మహాజన పాదయాత్ర ఆదివారం కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలంలో జరిగింది. ఈ సందర్భంగా తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ.. సిద్దిపేట జిల్లాలో కేవలం 40 మందికి డబుల్ బెడ్‌రూంలు ఇచ్చి రాష్ట్రంలో అందరికీ ఇచ్చినట్లుగా చూపిస్తున్నారని, 40 ఇళ్లకు అయ్యే ఖర్చు కన్నా రెట్టింపు నగదును కేసీఆర్ ప్రచారానికి ఖర్చు పెట్టారన్నారు.
రాష్ట్రంలో 93 శాతం ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల అభివృద్ధికి సరైన ప్రణాళిక రూపొందించి అభివృద్ధి చేయాలని, అప్పుడే పోరాడి సాధించుకున్న రాష్ట్రానికి సార్థకత ఏర్పడుతుందన్నారు. ఈ సందర్భంగా ఆయన రుక్మాపూర్‌లో లెదర్‌పార్కు, ప్రతిపాదిత స్థలాన్ని సందిర్శంచారు. 20వేల మంది దళితులకు ఉపాధి కల్పించే లెదర్ పార్కును రాష్ట్ర ప్రభుత్వం విస్మరిస్తోందని, వెంటనే నిర్మాణాన్ని చేప్టాలని డిమాండ్ చేశారు.
-
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు












Click it and Unblock the Notifications