Yadagirigutta: యాదగిరిగుట్టలో భక్తుల రద్దీ..

ఆదివారం సెలవు దినం కావడంతో యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. స్వామివారి దర్శనం కోసం భక్తలు వేచి ఉన్నారు. ఎండకాలం కావడంతో తెల్లవారుజాము నుంచి భారీగా భక్తుల వస్తున్నారు. భక్తులు భారీగా రావడంతో ఉచిత దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది. స్వామివారి ప్రత్యేక ప్రవేశ 150 రూపాయల దర్శనానికి 2 గంటల సమయం పడుతుంది. భక్తులతో కొండ కింద లక్ష్మీపుష్కరిణి, కల్యాణకట్ట, పార్కింగ్ ప్రదేశం రద్దీగా మారింది.

కొండపైన బస్ బే, దర్శన, ప్రసాద క్యూలైన్లు, ప్రధానాలయ ప్రాంగణం భక్తులతో నిండిపోయాయి. ఈ క్రమంలో వేసవి తాకిడికి ఇబ్బంది పడకుండా చలవ పందిరిళ్లతో పాటు తాగునీటి సౌకర్యాలు ఏర్పాటు చేసినట్లు ఆలయ ఈవో భాస్కరరావు చెప్పారు. ఇటు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. అటు తిరుమలలో కూడా భక్తుల రద్దీ కొనసాగుతోంది. మరోవైపు మార్చి నెలకు సంబంధించి శ్రీవారి హుండీకి భారీగా ఆదాయం వచ్చింది. మార్చి నెలలో రికార్డు స్థాయిలో ఆదాయం వచ్చినట్లు టీటీడీ తెలిపింది. శ్రీవారి హుండీ ద్వారా రూ. 118.49 కోట్ల ఆదాయం వచ్చింది.

The crowd of devotees continues to be heavy in Yadagirigutta
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+