భట్టి పాదయాత్రపై ఎండ ప్రభావం.!అస్వస్ధతకు గురైనా సీఎల్పీ నేత.!
హైదరాబాద్ : పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క స్వల్ప అస్వస్థతకు గురైయ్యారు. నవాబ్ పేట మండలం రుక్కంపల్లి వద్ద ఆయన అనారోగ్యం పాలయ్యారు. డాక్టర్ వినోద్ కుమార్ గౌడ్ నేతృత్వంలో భట్టి విక్రమార్క ఆరోగ్యాన్ని పరీక్షించారు. ఎండలో వందల కిలోమీటర్ల దూరం నడవడం వల్ల ఫ్లూయిడ్స్ బాగా తగ్గాయని డాక్టర్లు వివరిస్తున్నారు.
తీవ్రమైన ఎండలోసుధీర్గంగా నడవడం వల్ల, వడ దెబ్బ, డీ హైడ్రేషన్ కు భట్టి విక్రమార్క గురయ్యారాని డాక్టర్ వినోద్ కుమార్ గౌడ్ ధ్రువీకరించారు. ఈ నేపథ్యంలో 48 గంటల పాటు భట్టి విక్రమార్కకు పూర్తిగా అబ్జర్వేషన్ అవసరం అని చెప్పారు. అంతేకాకుండా రాబోవు రెండు రోజులు పూర్తి విశ్రాంతి అవసరమని సూచించారు. డాక్టర్ సూచనల మేరకు పీపుల్స్ మార్చ్ పాదయాత్రకు.. రేపు, ఎల్లుండి (19, 20 తేదీల్లో) విరామం ప్రకటించడం జరిగిందని భట్టి వర్గం స్పష్టం చేసింది.

అంతే కాకుండా శుక్రవారం ఉదయం మరోసారి పరీక్షించిన వైద్యులు. విశ్రాంతి అనివార్యమని తేల్చి చెప్పారు. పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో వడదెబ్బతో అస్వస్థతకు గురైన సీఎల్పీ నేత, జననాయకుడు భట్టి విక్రమార్కకు చికిత్స కొనసాగుతుందని వైద్యులు తెలిపారు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చెర్ల నియోజకవర్గం నవాబ్ పేట మండలంలోని రుక్కంపేట గ్రామంలో ఏర్పాటు చేసిన టెంట్ లోనే భట్టి విక్రమార్కకు వైద్యం అందిస్తున్న జనరల్ ఫిజిషీయన్ డాక్టర్ పరదేశి, డాక్టర్ వినోద్ కుమార్ గౌడ్.

శుక్రవారం ఉదయం కూడా షుగర్ లెవెల్స్, బీపీ, ఫ్లూయిడ్స్ ను పరీక్షించారు. వడదెబ్బ తగలడం వల్ల డీ హైడ్రేషన్ ను గురికావడంతో.. తగిన విశ్రాంతి తప్పనిసరిగా తీసుకోవాలని.. అలాగే ఫ్లూయిడ్స్ తీసుకోవాలని సూచించారు. డీ హైడ్రేషన్ పూర్తిగా తగ్గేవరకూ.. ఎండల్లో నడవకూడదని భట్టి విక్రమార్కకు వైద్యులు సూచించారు. రేపు శనివారం మొత్తం వైద్యుల పర్యవేక్షణలో ఉండనున్నారు పీఎల్పీ నేత భట్టి విక్రమార్క.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications