BJP: శుక్రవారం బీజేపీ తొలి జాబితా.. ! కసరత్తు చేస్తోన్న నేతలు..
తెలంగాణలో అభ్యర్థులందరిని ప్రకటించి ముందున్న బీఆర్ఎస్ ప్రచారంలో దూసుకెళ్తోంది. ఇటు కాంగ్రెస్ కూడా తొలి జాబితా విడుదల చేసి ప్రచారం ముమ్మరంగా చేస్తోంది. అయితే బీజేపీ మాత్రం ఇప్పటి వరకు అభ్యర్థులను ఖరారు చేయలేదు. కమలదళం ఇప్పటికీ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తోంది. త్వరలో ఎన్నికల నోటిఫికేషన్ రానున్న నేపథ్యంలో శుక్రవారం బీజేపీ తొలి జాబితా ప్రకటించే అవకాశం ఉంది. మొదటి జాబితాలో 70 స్థానాలకు అభ్యర్థులను ఖారారు చేయనున్నట్లు తెలుస్తోంది.
శుక్రావరం సాయంత్రం బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం భేటీ తర్వాత బీజేపీ తొలి జాబితా విడుదల చేసే అవకాశం ఉంది. అభ్యర్థుల ఎంపికపై గురువారం ఢిల్లీలో వరుసగా సమావేశాలు జరిగాయి. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్, రాష్ట్ర అధ్యక్షడు కిషన్‌రెడ్డి, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్, పార్టీ సీనియర్ నేతలు ఈటల రాజేందర్, ప్రకాశ్ జవదేకర్ తదితరులు పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలతో వేర్వేరుగా భేటీ అయ్యారు.

ఈ సందర్బంగా పార్టీ బలంగా ఉన్న సీట్లు, అభ్యర్థుల బలాబలాలపై చర్చించినట్లు సమాచారం. రాష్ట్రంలో ప్రచారం ఎలా చేయాలనేదాని కూడా నేతలు చర్చించినట్లు తెలుస్తోంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రుల పర్యటనలు, ప్రచారం గురించి కూడా చర్చించారు. తెలంగాణ అనుసరించాల్సిన ప్రణాళికపై రాష్ట్ర నేతలకు బీజేపీ అధిష్ఠానం పెద్దలు దిశానిర్దేశం చేశారు.
ఎక్కడెక్కడ బహిరంగ సభలు ఏర్పాటు, ఎక్కడ భారీ ర్యాలీలు నిర్వహించాలనేదాని కూడా చర్చించారు. అలాగే మేనిఫెస్టోపై కూడా పార్టీ పెద్దలతో మాట్లాడినట్లు తెలుస్తోంది. మరోవైపు గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ పై సస్పెన్షన్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఆయనకు టికెట్ వస్తుందా రాదా అనే దానిపై స్పష్టత రాలేదు. ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యవహారం మా అంతర్గత విషయమని కిషన్ రెడ్డి అన్నారు. ఆయనపై సస్పెన్స్ ఎత్తివేస్తే ఆయన పోటీలో ఉంటారని స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications