భూమి లేని వారికి గుడ్ న్యూస్.. డిసెంబర్ 28న బ్యాంక్ ఖాతాలో రూ.6 వేలు..!

భూమి లేని నిరు పేదలకు కాంగ్రెస్ శుభవార్త చెప్పింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం భూమి లేని వారికి ఏడాదికి రూ.12 వేలు ఇస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. రెండు విడతల్లో ఈ డబ్బును అకౌంట్లో జమ చేస్తామని ప్రకటించారు. మొదటి విడతగా 2024 డిసెంబర్ 28న రూ.6 వేలు అకౌంట్లో జమ చేయనున్నట్లు తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తుందని విమర్శించారు. అప్పులపై కాంగ్రెస్ దగ్గర పక్కా లెక్కలు ఉన్నాయని స్పష్టం చేశారు.

బీఆర్ఎస్ చేసిన అప్పులకు తాము వడ్డీలు కడుతున్నట్లు చెప్పారు. కాంగ్రెస్ ఇప్పటి వరకు రూ.54 వే ల కోట్ల అప్పులు చేసిందని వివరించారు. ఈ లెక్కలపై అసెంబ్లీలో చర్చించేందుకు సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు. సన్న వడ్లకు రూ.500 బోనస్ ఇస్తున్నట్లు చెప్పారు. ఉచిత విద్యుత్ అందిస్తున్నట్లు గుర్తు చేశారు. రుణ మాఫీకి రూ. 21 వేల కోట్లు ఖర్చు చేసినట్లు చెప్పారు. అయితే ఇప్పటికీ కూడా చాలా మంది రైతులు రుణ మాఫీ కాక ఆందోళనగా ఉన్నారు.

The government will deposit Rs 12 000 in the accounts of those who do not have agricultural land

రుణ మాఫీ కానీ వారులో కాంగ్రెస్ కార్యకర్తలు ఎక్కువగా ఉన్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోందని ప్రతిపక్షాలు చెబుతున్నాయి. నమ్మి ఓటు వేస్తే ఇలా చేశారు ఏమిటని ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక భూమి లేని పేదలకు రూ.12 వేలు ఇచ్చే పథకంలో ఎంత మందికి ఇస్తారు అనేది స్పష్టత లేదు. అయితే గత ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీ కట్టడానికే ఆదాయం సరిపోతున్నట్లుగా తెలుస్తోంది. 10 నెలల్లో రూ.66, 722 కోట్ల అప్పులు కట్టామని భట్టి చెప్పారు. ఆర్థికంగా ఇబ్బంది ఉన్నప్పటికీ అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+