Cyclone Montha:ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు..ఫ్లాష్ ఫ్లడ్స్, బయటకు వెళ్లవద్దు..!!

మొంథా తుఫాన్ తీవ్రత పెరుగుతోంది. ఇప్పటికే ఉత్తరాంధ్ర.. కాకినాడ ప్రాంతంలో తుఫాను ప్రభావం మొదలైంది. పలు ప్రాంతాల్లో వర్షాలు కొనసాగుతున్నాయి. విమాన, రైళ్ల సర్వీసులను రద్దు చేసారు. తుఫాను ప్రభావిత ప్రాంతాలకు బస్సులను నిలుపుదల చేస్తూ నిర్ణయించారు. అధికార యంత్రాంగాన్ని ప్రభుత్వం అప్రమత్తం చేసింది. కాగా.. పలు జిల్లాల్లో భారీ వర్షాలతో పాటుగా ఫ్లాష్ ఫ్లడ్స్ పైన అలర్ట్స్ జారీ అవుతున్నాయి. ప్రజలను ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

తుఫాను కారణంగా ఏపీలో కోస్తా తీరం పైన భారీ ప్రభావం పడనుంది. ముందస్తు హెచ్చరికలు జారీ చేసారు. అదే విధంగా తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. వాయుగుండం తీరం దాటితే తెలంగాణలోని పలు ప్రాంతాలలో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని, ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని చెప్పారు. ఈ రోజు నుంచి మూడు రోజులు పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నట్లు చెప్పారు. ఇదిలా ఉంటే ఇప్పటికే.. పలు జిల్లాల్లో మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి. దీంతో.. అధికార యంత్రాంగం అప్రమత్తం అయింది.

The IMD has issued red alerts for heavy rains in parts of Telangana as Cyclone Montha nears landfall

కాగా, పలు జిల్లాల్లో చాలా భారీ వర్షం పడనున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కొన్ని చోట్ల 90-150 మి.మీ వర్షాలు పడతాయని పేర్కొన్నారు. కొన్ని చోట్ల 40-70 మి.మీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. కాగా, హైదరాబాద్ నగరంలో ఇప్పటికే పలు చోట్ల భారీ వర్షం కురిసింది. దీంతో రోడ్లు, కాలనీలు జలమయం అయ్యాయి.

అలాగే.. ఇవాళ(మంగళవారం) కూడా.. నగరంలోని పలు చోట్ల మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. ఇవాళ ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు వర్షాలు కురుస్తాయన్నారు. సాయంత్రం తరువాత వర్షాలు తగ్గే అవకాశం ఉన్నట్లు చెప్పారు. వర్షాల నేపథ్యంలో.. అధికారులు అప్రమత్తం అయ్యారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. హైదరాబాద్ కు వచ్చే పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+