RTC: ప్రయాణికుడిపై ఆర్టీసీ సిబ్బంది దాడి.. !
ప్రయాణికుడిపై ఆర్టీసీ సిబ్బంది దాడి చేసిన ఘటన రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ బస్టాండ్ లో జరిగింది. బస్సు ఆలస్యం ఎందుకు అయిందని అడిగినందుకు ప్రయాణికుడిని కొట్టారు. ఓ ప్రయాణికుడు షాద్ నగర్ బస్టాండ్ నుంచి హైదరాబాద్ వెళ్లడానికి వచ్చాడు. చాలా సమయం గడిచినా బస్ రాలేదు. దీంతో అతను విచారణ అధికారి వద్దకు వెళ్లాడు. హైదరాబాద్ కు వెళ్లే బస్సు ఎప్పుడు వస్తుందని అడిగారు.
ఈ క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. అక్కడే ఉన్న ఆర్టీసీ సిబ్బంది ప్రయాణికుడిని కొట్టారు. ఇది స్థానికంగా చర్చనీయాంశం అయింది. హైదరాబాద్ బస్సులు గంట నుంచి రావడం లేదు, టైమింగ్ ఏమైనా చేంజ్ అయిందా? ఏ టైం కి వస్తాయని అడిగినందుకు బస్సు డ్రైవర్ కొట్టారని తోటి ప్రయాణికులు తెలిపారు. ఇంత దౌర్జన్యమా ఇదేం పద్ధతి అంటూ తోటి ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రయాణికుడి ఆర్టీసి సిబ్బంది చితకబాదుతుండగా.. అక్కడే ఉన్న మిగతా ప్రయాణికులు వీడియో తీశారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిపై ఆర్టీసీ అధికారులు ఇంకా స్పందించ లేదు. ఆర్టీసి సిబ్బంది పై దాడి చేస్తే.. కఠిన చర్యలు తీసుకుంటున్నారు. మరి ఆర్టీసీ వారు దాడి చేస్తే ఎలాంటి చర్యలు తీసుకోవాలని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.












Click it and Unblock the Notifications