చంద్రబాబు, వైఎస్సార్‌పై రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
జాతీయ రాజకీయాల్లో తెలుగువారి పాత్ర సన్నగిల్లిందన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ హెచ్ఐసీసీ వేదికగా మూడు రోజులపాటు జరిగిన ప్రపంచ తెలుగు సమాఖ్య 12వ మహాసభల ముగింపు కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. విదేశాలకు వెళ్లిన తెలుగువారంతా ఒకే వేదిక మీదకు రావడం సంతోషంగా ఉందన్నారు.
విదేశాలకు వెళ్లిన వారికి తెలుగుతో అనుబంధం తగ్గిపోతోందన్నారు సీఎం రేవంత్. నాలెడ్జ్ కోసం ఏ భాష నేర్చుకున్నా తెలుగును తక్కువగా చేయొద్దని సూచించారు. హైదరాబాద్‌లో అద్భుతమైన అంతర్జాతీయ సంస్థలున్నాయని, నగర అభివృద్ధికి పాటుపడేందుకు తెలుగు పారిశ్రామికవేత్తలను ఆహ్వానిస్తున్నామని తెలిపారు.

రాజీవ్ గాంధీ ఈ దేశానికి కంప్యూటర్ పరిచయం చేసి.. సాంకేతిక నైపుణ్యాన్ని అందించారని.. ఆ తర్వాత నారా చంద్రబాబు నాయుడు కంప్యూటర్ యుగాన్ని ముందుకు తీసుకెళ్లారని సీఎం రేవంత్ తెలిపారు. ఐటీని వేగంగా అభివృద్ధి చేసే ముఖ్యమంత్రిగా నిర్ణయాలు తీసుకోవడంతో ఈరోజు ఈ ప్రాంతమంతా అత్యంత ఆధునిక సాంకేతిక నైపుణ్యంతో అభివృద్ధి జరుగుతోందన్నారు. ఈ అభివృద్ధి ప్రపంచంతో పోటీ పడే విధంగా మనకు అవకాశాలు కల్పిస్తోందన్నారు సీఎం రేవంత్.

దానికి కొనసాగింపుగా వైఎస్ఆర్ హయాంలో ఓఆర్ఆర్, అంతర్జాతీయ విమానాశ్రయం, ఐటీ, ఫార్మా రంగాల్లో పెట్టుబడులతో మరింత ముందుకు తీసుకెళ్లారని రేవంత్ వివరించారు. దేశంలో ఉత్పత్తి అవుతున్న బల్క్ డ్రగ్‌లో 35 శాతం మన హైదరాబాద్ నుంచి తెలుగువాళ్లే ఉత్పత్తి చేస్తున్నారంటే ఇది మనందరికీ గర్వకారణమని రేవంత్ పేర్కొన్నారు. తెలంగాణ ఆదాయంలో 65 శాతం హైదరాబాద్ నుంచే వస్తుందన్నారు. అందుకు కారణం ఆనాటి ముఖ్యమంత్రులు తీసుకున్న కీలక నిర్ణయాలే కారణమని వ్యాఖ్యానించారు.

జాతీయ రాజకీయాల్లో తెలుగువారి ప్రభావం తగ్గిపోతుందన్న సీఎం రేవంత్.. నీలం సంజీవరెడ్డి, పీవీ నరసింహారావు, నందమూరి తారక రామారావు దేశ రాజకీయాల్లో ఎంతో కీలక పాత్ర పోషించారని రేవంత్ అన్నారు. ఆ తర్వాత వెంకటస్వామి, జైపాల్ రెడ్డి, వెంకయ్యనాయుడు జాతీయ రాజకీయాల్లో ప్రభావం చూపారన్నారు. రెండు మూడు తరాలకు మధ్య చంద్రబాబు నాయుడు, వైఎస్ఆర్ ప్రభావం చూపించినా.. ప్రస్తుతం జాతీయ రాజకీయాల్లో తెలుగువారి పాత్ర సన్నగిల్లుతోందన్నారు.
సీజేఐగా ఎన్వీ రమణ, ఉపరాష్ట్రపతిగా వెంకయ్యనాయుడు, ఉత్తమ పార్లమెంటేరియన్ గా జైపాల్ రెడ్డి రాణించిన సందర్భాలున్నాయన్నారు. అయితే, నేడు చట్టసభల్లో ఎవరైనా తెలుగువారు మాట్లాడతారా అని ఎదురుచూడాల్సిన పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.
-
హైదరాబాద్ మెట్రో విస్తరణపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన! -
హైదరాబాద్‌లోని ప్రయాణికులకు ఆర్టీసీ గుడ్‌న్యూస్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
ఎల్బీ నగర్ - హయత్ నగర్ డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్! -
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
క్యూర్, ప్యూర్, రేర్ అనే అనే మూడు ప్రాంతాలుగా తెలంగాణ: మూసీపై రేవంత్ కీలక ప్రకటన -
హైదరాబాద్ To బ్యాంకాక్.. తక్కువ ధరకే ఫారిన్ టూర్.. బీచ్ లో చిల్ అవుతూ.. -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565












Click it and Unblock the Notifications